Site icon NTV Telugu

Internal Conflict In Team India: టీమిండియాలో అంతర్గత పోరు.. గంభీర్, కోహ్లీ, రోహిత్ మధ్యే..?

Taem

Taem

Internal Conflict In Team India: భారత్‌- ఆస్ట్రేలియా తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడంతో టీమిండియాలో ఉత్సాహం పెరిగినట్లు కనిపించినప్పటికీ, డ్రెస్సింగ్ రూంలో మాత్రం పరిస్థితి మరో విధంగా ఉందని సమాచారం. ముఖ్యంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో కోహ్లీ, రోహిత్‌ల మధ్య సంబంధాలు అనుకున్నంత మంచిగా లేవనే వార్తలు బీసీసీఐ దృష్టికి చేరాయి. గంభీర్ కోచ్ గా పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ముగ్గురి మధ్య కెమిస్ట్రీ కుదరలేదని ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతుంది. ఇక, ఈ పరిస్థితిపై చర్చించేందుకు రాయ్‌పూర్ లేదా విశాఖపట్నంలో ప్రత్యేక సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

Read Also: Rohit-Kohli: 1, 3 స్థానాలు ఇప్పటికే ఫిక్స్‌.. 2027 వన్డే వరల్డ్‌కప్‌లో రో-కో!

అయితే, విరాట్ కోహ్లీ, రోహిత్‌ శర్మలు అనూహ్యంగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత నుంచే ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సమయంలో రోహిత్ శర్మ, సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు సమాచారం. కాగా, విరాట్ కోహ్లీ ఆసీస్ తో జరిగిన సిరీస్ లోని తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయ్యాడు. ఇక, మూడో మ్యాచ్‌లో ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. అదే మ్యాచ్‌లో రోహిత్ సెంచరీ కొట్టాడు. అయితే, మరో వైపు దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే తర్వాత కోహ్లీ, గంభీర్ మధ్య సరైన కమ్యూనికేషన్ కనిపించలేదు. వీరిద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడటం ఎక్కడ కనిపించలేదు.

Read Also: Samantha : మళ్ళీ పెళ్లి చేసుకున్న సమంత.. వరుడు ఎవరంటే?

అలాగే, కోహ్లీ, రోహిత్ అభిమానులు సోషల్ మీడియాలో గంభీర్‌పై తీవ్రమైన విమర్శలు చేయడంతో బీసీసీఐ అసహనం వ్యక్తం చేసినట్లు టాక్. ఈ సమస్యను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితి బోర్డుకు పెద్ద తలనొప్పిగా మారిందని బీసీసీఐ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ఇక, కోహ్లీ, రోహిత్, గంభీర్‌ల మధ్య నిజంగా విభేదాలున్నాయా? లేక ఇవన్నీ సోషల్ మీడియాలో ఊహాగానాలా? అన్న ప్రశ్నకు సమాధానం రాబోయే మ్యాచ్‌ల్లో తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భారత జట్టులో అంతర్గత పోరు మాత్రం ఉంటే రాబోయే ICC టోర్నమెంట్లపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

Exit mobile version