Aaryavir Sehwag: పాక్‌పై గెలుపు వెనుక అసలు ప్లాన్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆర్యవీర్ సెహ్వాగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aaryavir Sehwag Hails Mohit Ulva Batting: అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత యువ జట్టు చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన హోరాహోరీ పోరులో భారత్ ఒక్క వికెట్ తేడాతో గెలుపొందింది. శనివారం అల్ అమరాత్లో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసి విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనకు ముందు డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన చర్చ గురించి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’ ఆర్యవీర్ సెహ్వాగ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని, లక్ష్యం మరీ పెద్దది కాదని మేము భావించాం. సాధారణంగా బ్యాటింగ్ చేస్తూ మా సహజమైన షాట్లు ఆడితే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే నమ్మకం మాలో ఉంది. లక్ష్యం భారీగా ఉన్నప్పటికీ ఆట తీరును మార్చుకోవాలని మేము అనుకోలేదు. జట్టు సమావేశాల్లో చివరి 10 ఓవర్లలో 100 లేదా 120 పరుగులు చేయగల సామర్థ్యం గురించి తరచూ చర్చిస్తుంటాము. అందుకే ఎవరో ఒకరు క్రీజులో నిలిచి చివరి వరకు బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. లక్య ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తించాడు’ అని ఆర్యవీర్ ప్రశంసించాడు.
Also Read
- IND vs NZ ODI: ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత్ తుది జట్టులో ఊహించని మార్పులు.. కొత్త కుర్రాడి ఎంట్రీ..
- Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..
- Mohit Ulva: చివరి బంతికి కావాల్సింది 3 పరుగులు.. ఆ టైంలో నేను చేసింది ఇదే..
- Under -19 Asia Cup: టెయిలెండర్ల అద్భుతం.. పాకిస్థాన్‌ను చిత్తు చేసి ఆసియా కప్ కొట్టేసిన భారత్..
‘చివర్లో మోహిత్ ఉల్వా, మనాల్ చేసిన బ్యాటింగ్ కూడా అద్భుతం. ఒత్తిడిలోనూ వారు జట్టును విజయానికి చేరువ చేశారు. వారి ప్రదర్శనకు ప్రత్యేకంగా అభినందనలు’ అని ఆర్యవీర్ సెహ్వాగ్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో మోహిత్ 26 బంతుల్లో అజేయంగా 49 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇక టోర్నమెంట్ మొత్తంలో నిలకడగా రాణించిన ఆర్యవీర్ 361 పరుగులతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం తన తండ్రితో ఇంకా మాట్లాడలేదని, తర్వాత మాట్లాడతానని తెలిపాడు. భారత్ విజయంలో లక్యతో పాటు ఆర్యవీర్, మోహిత్, మనాల్ ప్రదర్శనలు కీలకంగా నిలిచాయి.
తాజావార్తలు
-
Lalit Modi Becomes British Citizen: లలిత్ మోడీకి బ్రిటిష్ పౌరసత్వం.. ఇక యూకేనే శాశ్వత నివాసం!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
Gaza Conflict: ఇజ్రాయెల్ డ్రోన్ దాడిలో.. హమాస్ కమాండర్ సమీర్ అబూ యూనిస్ హతం
-
Aaryavir Sehwag: పాక్‌పై గెలుపు వెనుక అసలు ప్లాన్ ఇదే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఆర్యవీర్ సెహ్వాగ్!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
ట్రెండింగ్
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్‌గా.. మరీ తక్కువ మ్యాచ్‌ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!