Indian Star Batsman Ruled Out From ODI Series Against Australia: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ని కైవసం చేసుకున్న భారత్.. ఈనెల 17వ తేదీ నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడేందుకు సిద్ధమవుతుంది. అయితే.. ఈలోపు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. గాయం కారణంగా ఓ స్టార్ ఆటగాడు జట్టుకి దూరమయ్యాడు. అతనెవరా? అని అనుకుంటున్నారా! మరెవ్వరో కాదు.. శ్రేయస్ అయ్యర్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాలుగో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా.. శ్రేయస్‌కు మళ్లీ వెన్నునొప్పి రావడంతో, అతడు ఆట మధ్యలోనే మైదానాన్ని వీడాడు. ఈ గాయం నుంచి అతడు ఇప్పుడప్పుడే కోలుకునే ఆస్కారం లేదు కాబట్టి.. అతని స్థానంలో మరొకరిని రంగంలోకి దింపేందుకు బీసీసీఐ సిద్ధమవుతోంది. ఇదే గాయం కారణంగా.. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు కూడా శ్రేయస్ అందుబాటులో ఉండటం సందేహంగా మారింది.
Salman Khan: ఆ సమయంలో సల్మాన్ డబ్బులు ఆఫర్ చేశాడు.. గ్యాంగ్‌స్టర్ బిష్ణోవ్ బాంబ్
ఇక ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ గురించి మాట్లాడితే.. మొదటి రెండు టెస్టుల్లో భారత్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. మొదటి టెస్ట్ మ్యాచ్ అయితే.. ఒక ఇన్నింగ్స్‌తో పాటు 132 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. అదే జోరుని రెండో టెస్టులోనూ కొనసాగించిన భారత్.. 6 వికెట్ల తేడాతో ఆసీస్‌పై నెగ్గింది. అయితే.. మూడో మ్యాచ్‌లో బ్యాటర్లతో పాటు బౌలర్లు సైతం చేతులు ఎత్తేయడంతో భారత్ ఓటమి చవిచూసింది. ముఖ్యంగా.. బ్యాటర్లు పూర్తిగా విఫలం అవ్వడం వల్లే ఈ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. చివరగా నాలుగో టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇరుజట్లు తొలి ఇన్నింగ్స్‌ని నాలుగు రోజులపాటు ఆడారు. తొలుత ఆస్ట్రేలియా 480 పరుగులకు ఆలౌట్ అవ్వగా.. భారత్ 571 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్‌లోనే టెస్టుల్లో విరాట్ కోహ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. 186 పరుగులతో అతడు విజృంభించడంతో.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్‌ని కైవసం చేసుకున్నాడు.
Student Suicide: మార్కులు తక్కువగా వస్తున్నాయని విద్యార్థిని ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో ఘటన