India vs Zimbabwe: భారత్ క్లీన్ స్వీప్.. ముచ్చెమటలు పట్టించిన సికందర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India Won 3rd ODI Against Zimbabwe In Harare Sports Club: హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ 13 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగులు చేయగా.. లక్ష్య చేధనకు దిగిన జింబాబ్బే 276 పరుగులకి ఆలౌటైంది. ఒకానొక దశలో ఈ మ్యాచ్ జింబాబ్వే గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ చివర్లో భారత బౌలర్లు బంతితో తమ మాయాజాలం చూపించి జింబాబ్వే బ్యాట్స్మన్లను అడ్డుకోవడంతో, మ్యాచ్ భారత్ వశమైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న భారత్.. ఆరంభం నుంచే బాగా రాణించింది. ఓపెనర్లు శుభారంభమే ఇచ్చారు. ఆ వెనువెంటనే పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ (97 బంతుల్లో 130 పరుగులు), ఇషాన్ కిషన్ (61 బంతుల్లో 50 పరుగులు) .. మరో వికెట్ పడకుండా భారీ భాగస్వామ్యమే జోడించారు. శుభ్మన్ సెంచరీతో విజృంభిస్తే, ఇషాన్ అర్థశతకంతో చిచ్చరపడిగులా చెలరేగిపోయాడు. ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదారు. శుభ్మన్‌కి ఇది తొలి అంతర్జాతీయ శతకం. వీళ్లిద్దరు క్రీజులో కుదురుకోవడం వల్లే.. భారత్ 289 పరుగులు చేయగలిగింది. మిగతా బ్యాట్స్మన్లు కనీసం ప్రయత్నం చేయకుండానే పెవిలియన్ చేరారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ ఐదు వికెట్లతో అదరహో అనిపించాడు.
Also Read
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
- Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
- Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
ఇక 290 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన జింబాబ్వే.. మొదట్లో కాస్త తడబడింది. ఓపెనర్లు వెంటనే ఔటయ్యారు. సీన్ విలియన్స్ కాసేపు క్రీజులో కుదుర్కొని.. జట్టుకి ఊపు తీసుకొచ్చాడు. ఇక సికందర్ రాజా భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడనే చెప్పుకోవాలి. ఒకవైపు జింబాబ్వే వికెట్లు పడుతున్నా.. అతడు ఒత్తిడికి లోనవ్వకుండా పరుగుల వర్షం కురిపిస్తూ వచ్చాడు. చివర్లో ఇతనికి బ్రాడ్ ఇవాన్స్ కాసేపు తోడు ఇవ్వడంతో.. జింబాబ్వేనే మ్యాచ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. భారత బౌలర్లు స్వల్ప వ్యవధిలోనే ఆ ఇద్దరిని ఔట్ చేయడంతో మ్యాచ్ టర్న్ తీసుకుంది. 13 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఫలితంగా.. 3-0 తేడాతో భారత్ సిరీస్ నెగ్గింది.
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!