Womens Asia Cup 2022: నేటి నుంచి మహిళల ఆసియా కప్.. శ్రీలంకతో భారత్ తొలిపోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీ తమ సత్తా చాటేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇంగ్లండ్‌పై సిరీస్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత మహిళల జట్టు.. శనివారం నుంచి టీ20 ఫార్మాట్‌లో ఆసియాకప్ ఆడనుంది. శనివారం జరుగనున్న తొలి పోరులో శ్రీలంకతో టీమ్‌ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఈ ఫార్మాట్‌లో అంతర్జాతీయ స్థాయిలో మన అమ్మాయిలు నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నా.. ఆసియా వరకైతే హర్మన్‌ప్రీత్ బృందం ఫేవరెట్ అనే చెప్పొచ్చు. 2004 నుంచి 2018 వరకు ఏడుసార్లు మహిళల ఆసియా కప్ జరగగా.. అందులో ఆరుసార్లు భారత్ విజయం సాధించడం విశేషం. వన్డే ఫార్మాట్‌లో నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల జట్టు టీ20 ఫార్మాట్‌లో రెండు సార్లు టైటిల్ నెగ్గారు. గత టోర్నీలో మాత్రం బంగ్లాదేశ్‌పై ఓటమి పాలైంది.
నాలుగేళ్ల విరామం తర్వాత ఆసియా ఖండంలోని అత్యుత్తమ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. శనివారమే ఈ టీ20 టోర్నీకి తెరలేవనుంది. ఏడు జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ ఆతిథ్య బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ పోరుతో మొదలవనుంది. 2020లో జరగాల్సిన టోర్నీ కరోనా కారణంగా మొదట 2021కి వాయిదా పడి, ఆ తర్వాత రద్దయింది. నాలుగేళ్ల తర్వాత జరుగుతున్న ఈ టోర్నీలో విజయం సాధించేందుకు పలు దేశాల జట్లు పోటీ పడనున్నాయి. ఆఖరి వన్డేలో ‘మన్కడింగ్’తో వార్తల్లోకెక్కిన హర్మన్‌ప్రీత్ బృందం.. అవన్నీ పక్కన పెట్టి ఆటపై దృష్టిపెట్టేందుకు సిద్ధమైంది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో రజత పతకం, ఇంగ్లండ్‌పై వన్డేల్లో సాధించిన విజయాలు సహజంగానే భారత్‌ను ఫేవరెట్‌గా చూపిస్తున్నాయి. టీమిండియా ఇవాళ శ్రీలంకతో మ్యాచ్ తర్వాత వరుసగా మలేసియా (3న), యూఏఈ (4న), పాకిస్తాన్ (7న), బంగ్లాదేశ్ (8న), థాయ్‌లాండ్ (10న) జట్లతో తలపడుతుంది.
Also Read
- CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
- Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
- RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్‌గా నిలిచిన పాటిదార్ సేన..
- Pat Cummins: "అభిషేక్, ఇషాన్, క్లాసెన్ కాదు.. వాళ్ల వల్లే మ్యాచ్ గెలిచాం".. SRH కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sourav Ganguli: బుమ్రా టీ20 వరల్డ్ కప్‌కు దూరం కాలేదు
మొత్తం 7 జట్లు బరిలోకి దిగుతుండగా, భారత్‌తో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, యూఏఈ, మలేసియా, థాయ్‌లాండ్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. యూఏఈ తొలిసారి ఆసియా కప్‌లో ఆడనుంది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో ఈ టోర్నీ జరగనుంది. ఒక్కో జట్టు మిగతా ఆరింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. లీగ్ దశ మ్యాచ్‌లు పూర్తయ్యేసరికి తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీస్‌లో తలపడతాయి. ప్రస్తుతం భారత జట్టు పటిష్టంగా ఉంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు వైస్ కెప్టెన్ స్మృతి మందన అద్భుత ఫామ్‌లో ఉండగా.. వారికి తోడుగా జెమీమా రోడ్రిగ్స్ చేరడంతో జట్టు మరింత పటిష్టంగా మారింది. గత ఆసియా కప్ ఫైనల్‌ను పక్కన పెడితే మరోసారి భారత్ కప్‌ను దక్కించుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. అబ్బాయిలు ఆసియా కప్‌లో నిరాశపరిచినా.. మరి అమ్మాయిలైనా సాధిస్తారో వేచి చూడాల్సిందే!.
తాజావార్తలు
-
Telangana Heatwave: షాకింగ్.. తెలంగాణలో వడ దెబ్బతో 34 మంది మృతి.. 18 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
-
CM Vijay: సీఎం విజయ్ చేతిలో విరాట్ కోహ్లీ సైన్ చేసిన బ్యాట్.. సోషల్ మీడియాను ఊపేస్తున్న ఫొటో..
-
Triumph Bonneville T120: భారత్‌లో లాంచ్ అయిన ట్రయంఫ్ బోనేవిల్ T120.. రెట్రో డిజైన్ ధర, ఫీచర్లు ఇవే
-
Heinrich Klaasen IPL Record: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హెన్రిచ్ క్లాసెన్.. ఆ రికార్డులు బద్దలు
-
Peddi: భోపాల్‌లో ‘పెద్ది’ ఆడియో లాంచ్‌పై భారీ ప్లాన్..ఈవెంట్‌కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్‌తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!