Site icon NTV Telugu

India vs Pakistan: నష్టపరిహారం, సస్పెన్షన్.. పీసీబీ, ఐసీసీ మీటింగ్ లేటెస్ట్ డీటెయిల్స్ ఇవే!

Icc Warns Pcb

Icc Warns Pcb

ICC Warns PCB Over Match Boycott vs India: టీ20 ప్రపంచ కప్‌ 2026లో భారత్‌తో ఫిబ్రవరి 15న జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ పభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌ను ఎలాగైనా నిర్వహించాలని ఐసీసీ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఐసీసీ సంప్రదింపులు జరుపుతోంది. లాహోర్‌లో ఆదివారం పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ, ఐసీసీ డిప్యూటీ ఛైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్‌ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం సమావేశమయ్యారు. ఐదు గంటలకు పైగా చర్చలు సాగినట్లు తెలుస్తోంది. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించే ఆలోచనపై స్ఫష్టమైన వివరణ ఇవ్వాలని పీసీబీని ఐసీసీ ఆదేశించినట్లు సమాచారం. అదే సమయంలో పీసీబీ హెచ్చరించిందట.

భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తే.. మ్యాచ్ కారణంగా ఐసీసీకి కలిగే ఆర్థిక నష్టాన్ని పాకిస్థాన్ నుంచి వసూలు చేసే హక్కు తమకు ఉందని పీసీబీకి ఐసీసీ గుర్తు చేసిందట. భారత్ మ్యాచ్‌లకు సంబంధించిన బ్రాడ్‌కాస్టింగ్, స్పాన్సర్‌షిప్, డిజిటల్ వ్యూస్ వంటి అంశాల్లో వచ్చే భారీ ఆదాయం దృష్ట్యా ఈ నష్టం భారీగా ఉండొచ్చని ఐసీసీ సూచించింది. తాము ఎలాంటి వివాదాలకు వెళ్లాలనుకోవడం లేదని కూడా పీసీబీకి ఐసీసీ తెలిపింది. సమస్యను చర్చల ద్వారా పరిష్కరించాలన్నదే తమ మొదటి ప్రాధాన్యమని పేర్కొంది.

Also Read: India vs Pakistan: వాటా, సిరీస్‌లు, హ్యాండ్‌షేక్.. పాకిస్థాన్ డిమాండ్స్ ఇవే!

ఒకవేళ భారత్‌తో మ్యాచ్ బహిష్కరిస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయని పీసీబీకి ఐసీసీ వార్నింగ్ ఇచ్చిందట. సస్పెన్షన్ లేదా సభ్యత్వ రద్దు లాంటి కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని హెచ్చరించింది. ఈ పరిణామాలతో భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌పై ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ఆదరణ పొందిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌పై తీసుకునే నిర్ణయం.. పాకిస్థాన్ క్రికెట్ భవిష్యత్తుపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ పీసీబీ ఐసీసీకి ఎలాంటి వివరణ ఇస్తుంది? అనే దానిపై ఉంది.

Exit mobile version