India vs Pakistan: వాటా, సిరీస్‌లు, హ్యాండ్‌షేక్.. పాకిస్థాన్ డిమాండ్స్ ఇవే!
- భారత్‌తో మ్యాచ్ ఆడమని ప్రకటించిన పాకిస్థాన్ ప్రభుత్వం
- భారత్‌తో మ్యాచ్‌కు సిద్ధమంటూ పాక్ సంకేతాలు
- భారత్‌తో మ్యాచ్ కోసం పాక్ డిమాండ్స్ ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్‌తో మ్యాచ్ ఆడేది లేదని పాకిస్థాన్ ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం అధికారికంగా ఐసీసీకి ఇంకా ఏమీ చెప్పలేదు. మ్యాచ్ ఆడకుంటే కఠిన చర్యలు తప్పవని పీసీబీని ఐసీసీ హెచ్చరించింది. అయితే మొన్నటి వరకు బీరాలకు పోయిన పీసీబీ.. ఇప్పుడు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తాజాగా ఐసీసీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న పీసీబీ.. భారత్‌తో మ్యాచ్‌కు తాము సిద్ధమంటూ, మూడు కీలక డిమాండ్లను ముందుంచినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్స్ ఏవో చూద్దాం.
తాజా సమాచారం ప్రకారం.. భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ మూడు ప్రధాన డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది ఐసీసీ రెవెన్యూలో ఎక్కువ వాటా. భారత జట్టు మ్యాచ్‌ల వల్ల ఐసీసీకి భారీ ఆదాయం వస్తున్న నేపథ్యంలో.. ఆ లాభాల్లో తమకు కూడా ఎక్కువ శాతం ఇవ్వాలని పీసీబీ కోరుతోందని సమాచారం. రెండో డిమాండ్ సంచలనం అనే చెప్పాలి. అదే భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక సిరీస్‌ల పునరుద్ధరణ. గత కొన్నేళ్లుగా రాజకీయ పరిస్థితుల కారణంగా రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. భారత్‌తో ఆడేది లేదు అని ప్రకటించిన పీసీబీ.. ఇప్పుడు మాత్రం ద్వైపాక్షిక సిరీస్ కావాలని కోరడం విశేషం.
Also Read
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CWC27 Ticket Ballot: టికెట్ బ్యాలెట్ ప్రక్రియకు అనూహ్య స్పందన.. 142 దేశాల నుంచి 1.50 కోట్ల దరఖాస్తులు..
- Cheteshwar Pujara: భారత్‌లో కూడా క్రిస్ గేల్ ఉన్నాడు.. చతేశ్వర్ పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు..
- ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
Also Read: Sanju Samson: రెండు ప్రపంచకప్‌లు, 10 మ్యాచ్‌లు.. సంజు శాంసన్ ఎన్ని రన్స్ చేశాడంటే?
మూడో డిమాండ్ హ్యాండ్‌షేక్ ప్రోటోకాల్. మ్యాచ్ ముందు, తర్వాత భారత ఆటగాళ్లు తప్పనిసరిగా హ్యాండ్‌షేక్ చేయాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని ఐసీసీ పాకిస్థాన్ కోరుతోంది. ఇది స్పోర్ట్స్‌మన్‌షిప్ పేరుతో పెట్టిన డిమాండ్ అయినా.. దీనిపై కూడా చర్చ జరుగుతోంది. ఈ డిమాండ్లపై ఐసీసీ, బీసీసీఐ ఎలా స్పందిస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారత్–పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం ఆట మాత్రమే కాదు.. కోట్లాది అభిమానుల భావోద్వేగాలతో కూడిన హై-వోల్టేజ్ ఈవెంట్. కానీ ఆ మ్యాచ్‌కు షరతులు పెట్టడం ఎంతవరకు సరైనదన్న చర్చ ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!