NTV Telugu Site icon

IND vs PAK: లాహోర్ వేదికగా ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్.. ఛాంపియన్స్ ట్రోఫీ డ్రాఫ్ట్ సిద్ధం చేసిన పీసీబీ..

Cricket

Cricket

IND vs PAK: 2025లో పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగబోతోంది. అయితే, ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్‌ని బుధవారం ఐసీసీకి పాక్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) సమర్పించింది. మార్చి 1న లాహోర్‌లో ఈ హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇదిలా దీనిపై బీసీసీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు మొత్తం 15 మ్యాచ్‌లకు పాకిస్తాన్‌లోని లాహోర్, కరాచీ, రావల్పింది ఆతిథ్యం ఇవ్వనుంది.

Read Also: Multivitamins: రోజూ మల్టీవిటమిన్లు తీసుకున్నంత మాత్రాన ఎక్కువ కాలం జీవించరు..

ఇటీవల బార్బడోస్‌లో జరిగిన ఐసీసీ టీ20 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీని ఆహ్వానించిన సమయం ఈ మేరకు ఛాంపియన్స్ ట్రోఫీ తాత్కాలిక షెడ్యూల్‌ని గురించి చర్చించారని సమాచారం. అయితే, భద్రతా కారణాలు, రాజకీయాల వల్ల భారత్, పాకిస్తాన్ ద్వైపాక్షిక సిరీస్‌లను ఆడటం లేదు. పాకిస్తాన్ ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసినా భారత్ పట్టించుకోలేదు. చివరిసారిగా 2008లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టోర్నీ జరిగింది. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ లాంటి ఐసీసీ టోర్నీల్లోనే ఇరు జట్లు తలపడుతున్నాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో అక్కడ ఆడేందుకు భారత్ వెళ్తుందా లేదా..? అనేది ప్రశ్నగా ఉంది. పాక్ మాత్రం దీనికి ఏర్పాట్లు చేసుకుంటోంది. భద్రతా, రవాణా కారణాల వల్ల భారత్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు లాహోర్‌లో నిర్వహించబడుతాయని తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్ కరాచీలో, రెండు సెమీఫైనల్స్ కరాచీ, రావల్పిండిలో, ఫైనల్ మ్యాచ్ లాహోర్‌లో జరుగుతుంది.