IND vs Pak Final WCL: భారత్- పాకిస్తాన్ మరోసారి టైటిల్ పోరులో తలపడబోతున్నాయి. ఈ ఉత్కంఠ పోరు కోసం క్రికెట్ అభిమానులు తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ రోజు బర్మింగ్‌హామ్ వేదికగా భారత్- పాకిస్థాన్ మధ్య వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ 2024 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి పాక్ ఫైనల్స్‌కు చేరుకోగా.. రెండో సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాను ఓడించి టీమిండియా ఫైనల్స్‌కు దూసుకొచ్చింది. ఈ టోర్నీలో భారత్-పాక్ టీమ్స్ మధ్య ఇది రెండో మ్యాచ్.. అంతకు ముందు భారత్‌పై పాకిస్థాన్ 68 రన్స్ తేడాతో విజయం సాధించింది. అలాంటి పరిస్థితిలో, ఈ రోజు భారత జట్టు ఎలా రాణిస్తుంది అనే అనుమానం కలుగుతుంది.
Read Also: Helicopter Crash : హవాయి ద్వీపం సమీపంలో కుప్పకూలిన పర్యాటక హెలికాప్టర్
అయితే, 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్- పాకిస్తాన్ జట్లు పోటీ పడ్డాయి. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఆ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 5 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఇర్ఫాన్ పఠాన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. అటువంటి పరిస్థితిలో ఈసారి కూడా ఇర్ఫాన్ పఠాన్‌తో సహా చాలా మంది ఆటగాళ్ళు 2007లో పాకిస్తాన్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడిన ఇండియా ఛాంపియన్స్‌లో భాగమయ్యారు. మరి చూడాలి ఈ రోజు జరిగే ఫైనల్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందనేది.
Read Also: Arekapudi Gandhi: నేడు కాంగ్రెస్ లో చేరనున్న అరికెపూడి గాంధీ..
తుది ఫైనల్ జట్లు:
టీమిండియా ఛాంపియన్స్ జట్టు: యువరాజ్ సింగ్ (కెప్టెన్ ), రాబిన్ ఉతప్ప (వికెట్ కీపర్), అంబటి రాయుడు, సురేష్ రైనా, యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, గురుకీరత్ సింగ్ మాన్, పవన్ నేగి, వినయ్ కుమార్, హర్భజన్ సింగ్, ధవల్ కులకర్ణి, రాహుల్ శుక్లా, ఆర్పీ సింగ్, నమన్ ఓజా, సౌరభ్ తివారీ, అనురీత్ సింగ్, రాహుల్ శర్మ ఉన్నారు.
పాకిస్తాన్ ఛాంపియన్స్ టీమ్: యూనిస్ ఖాన్ (కెప్టెన్), షాహిద్ అఫ్రిది, మిస్బా-ఉల్-హక్, కమ్రాన్ అక్మల్ (వికెట్-కీపర్), షర్జీల్ ఖాన్, సోహైబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, అమీర్ యామిన్, సొహైల్ తన్వీర్, వహాబ్ రియాజ్, సోహైల్ ఖాన్, అబ్దుల్ రజాక్, తౌఫీక్మర్ మహ్మద్ హఫీజ్, యాసర్ అరాఫత్, సయీద్ అజ్మల్, ఒమర్ అక్మల్, తన్వీర్ అహ్మద్ ఉన్నారు.