NTV Telugu Site icon

IND vs PAK: నేడే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మధ్య ఉత్కంఠ పోరు.. గెలిచేదెవరో.. ?

Ind Vs Pak

Ind Vs Pak

IND vs PAK: అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లో పాకిస్థాన్‌పై టీమిండియా ఆధిపత్యం కొనసాగుతుంది. చాలా ఏళ్లుగా భారత్‌తో మ్యాచ్‌ అంటే ఒత్తిడంతా పాక్ పైనే ఉంటుంది. పైగా ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్‌ ఓడి, సంక్లిష్ట స్థితిలో భారత్‌తో తలపడేందుకు సిద్ధమైంది దాయాది జట్టు. భారత్ జట్టు మాత్రం బంగ్లాను ఓడించి మంచి ఊపు మీదుంది. ఇక, ఈరోజు మ్యాచ్‌లో రోహిత్‌ సేనే హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో విజయంతో సెమీస్‌ బెర్తును ఫిక్స్ చేసుకోవాలని భారత్‌ చూస్తుంటే.. టోర్నీలో ఉండాలంటే ఈ మ్యాచ్ గెలిచి తీరాల్సిన స్థితిలో పాక్‌ ఉంది.

Read Also: Story Board: సనాతన సంస్కృతికి అద్దం పట్టిన మహా కుంభమేళా..!

ఇక, గత మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శన చూస్తుంటే తుది జట్టులో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు అనిపిస్తుంది. వన్డేల్లో వరుసగా రెండు సెంచరీలతో శుభ్ మన్ గిల్‌ తన ఫామ్‌ను కొనసాగిస్తుండగా.. రోహిత్‌ శర్మ అందించే శుభారంభాలు జట్టును ముందుకు నడిపిస్తున్నాయి. అయితే, విరాట్‌ కోహ్లీ మాత్రమే కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. ఇంకా తనదైన స్థాయిలో విరాట్‌ ఆడటం లేదు. అలాగే, బంగ్లాతో మ్యాచ్ లో కేఎల్ రాహుల్‌ ఆకట్టుకోగా.. శ్రేయస్ కూడా చెలరేగితే టీమిండియా భారీ స్కోరు చేయడం ఖాయం. కాగా, హార్థిక్, జడ్డూ బ్యాటింగ్‌ అవసరం రాకుండానే భారత జట్టు గత మ్యాచ్‌ను క్లోజ్ చేయగా.. అక్షర్‌ బ్యాటింగ్‌పై టీం మేనేజ్‌మెంట్‌ మరోసారి నమ్మకం ఉంచింది. బౌలింగ్‌లో షమీ అద్భుతంగా రాణించడంతో టీమిండియా బలం మరింత పెరిగినట్లైంది. మన బౌలర్లు ఎదుర్కొని పాక్‌ బ్యాటర్లు రన్స్ చేయడం అంత ఈజీ కాదు. మొత్తంగా భారత జట్టు ప్లేయర్స్ సమష్టి రాణిస్తే చేస్తే తిరుగుండదు.

Read Also: Pawan Kalyan: అపోలో ఆస్పత్రికి పవన్‌ కల్యాణ్‌.. డిప్యూటీ సీఎంకు వైద్య పరీక్షలు..

అయితే, పాకిస్తాన్‌ జట్టు పరిస్థితి మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన తొలి మ్యాచ్ లోనే ఓటమిపాలైంది. పైగా భారీ తేడాతో ఓడటంతో రన్‌రేట్‌పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ నేపథ్యంలో కచ్చితంగా భారత్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే ఆ టీమ్ ఈవెంట్ లో నిలుస్తుంది. లేదంటే ఆతిథ్య జట్టుగా సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడేది పాక్‌కి చివరిది అవుతుంది. టీమ్ బ్యాటింగ్‌ చాలా బలహీనంగా కనపడుతుంది. ఎన్ని వైఫల్యాలున్నా ఇప్పటికీ ఆ జట్టు ఇంకా బాబర్‌ ఆజమ్ పైనే ప్రధానంగా ఆధారపడుతుంది. కానీ, గత మ్యాచ్‌లో కూడా అతను చాలా స్లోగా బ్యాటింగ్‌ చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫఖర్‌ జమాన్ గాయంతో దూరం కావడంతో టీమ్‌లోకి వచ్చిన ఇమామ్‌ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. రిజ్వాన్, షకీల్‌ గత మ్యాచ్‌లో ఫెయిల్ అయ్యారు. మరోవైపు, బౌలింగ్ లో ముగ్గురు పేసర్లు పోటీ పడి మరి పరుగులు సమర్పించుకుంటున్నారు. ఇటీవలి రికార్డు చూస్తే.. షాహిన్ ఆఫ్రిది, రవూఫ్, నసీమ్‌లను టీమిండియా బ్యాటర్ల ఈజీగా పరుగులు రాబట్టారు. పైగా ఒక్క నాణ్యమైన స్పిన్నర్‌ కూడా పాక్ తుది జట్టులో లేడు. ఈ నేపథ్యంలో పాక్‌ గెలవాలంటే అసాధారణ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది.

Read Also: Story Board: సనాతన సంస్కృతికి అద్దం పట్టిన మహా కుంభమేళా..!

అయితే, గత మ్యాచ్‌ తరహాలోనే స్లో పిచ్ ఉంటుంది. కానీ బ్యాటర్లు పట్టుదలగా ఆడితే భారీ స్కోరు సాధించే అవకాశం ఉంది. వర్షం కురిసే ఛాన్స్ లేదు. మంచు ప్రభావం కూడా లేదు కాబట్టి టాస్‌ గెలిచిన జట్టు బ్యాటింగ్‌ ఎంచుకోవడం ఖాయం.

తుది జట్లు (అంచనా)
టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, నితీష్ రాణా.
పాకిస్తాన్‌: మహ్మద్ రిజ్వాన్‌ (కెప్టెన్‌), ఇమామ్, షకీల్, బాబర్ ఆజమ్, సల్మాన్, తాహిర్, ఖుష్‌దిల్, అఫ్రిది, నసీమ్, రవూఫ్, అబ్రార్‌.