IND vs AFG: ముల్లన్‌పూర్‌లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్‌పై 300 పరుగుల తేడాతో విజయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs AFG: న్యూ చండీగఢ్‌లోని ముల్లన్పూర్ వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత ఆటగాళ్లు అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆఫ్ఘన్ జట్టుకు అస్సలు చాన్సే ఇవ్వకుండా.. ఇన్నింగ్స్, 300 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు ఇదే అత్యంత భారీ విజయం కావడం విశేషం.
గిల్, రాహుల్ సెంచరీల మోత..
టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు, మిడిలార్డర్ బ్యాటర్లు అద్భుతమైన పునాది వేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 126 రన్స్‌తో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడగా.. క్లాసిక్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 100 రన్స్‌తో సెంచరీ కొట్టి కదం తొక్కాడు. వీరిద్దరి సెంచరీల దాటికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ జట్టుకు ఇండియా నయా స్పిన్ సెన్సేషన్, డెబ్యూటెంట్ మానవ్ సుతార్ చుక్కలు చూపించాడు. తన కెరీర్ లోనే మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పటికీ.. ఎంతో కంట్రోల్‌తో బౌలింగ్ చేస్తూ కేవలం 33 రన్స్ ఇచ్చి ఏకంగా 6 వికెట్లు (6/33) పడగొట్టి చరిత్ర సృష్టించాడు. సుతార్ స్పిన్ మ్యాజిక్కు ఆఫ్ఘన్ జట్టు ఇన్నింగ్స్‌లో కేవలం 152 పరుగులకే కుప్పకూలింది.
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్‌కు చెక్‌మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్‌లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
- Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే 'ఒకే ఒక్కడు'!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
ఫాలోఆన్‌లోనూ దెబ్బ
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు తేడాతో వెనుకబడటంతో టీమిండియా కెప్టెన్ గిల్ ఆఫ్ఘన్ టీమ్‌కు ఫాలోఆన్ ఇచ్చాడు. అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా ఆఫ్ఘన్ బ్యాటర్లు ఫైట్ చేస్తారేమో అని అనుకుంటే.. మళ్లీ మన బౌలర్లు విజృంభించారు. ఈసారి వాషింగ్టన్ సుందర్ తన స్పిన్ పవర్‌తో ఏకంగా 4 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. సుందర్ దెబ్బకు రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆఫ్ఘన్ జట్టు క్రీజులో ఎక్కువ సేపు నిలబడలేక కేవలం 112 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో భారత్ చారిత్రాత్మక ఇన్నింగ్స్ విజయాన్ని సొంతం చేసుకుంది.
Sundar wicket 😍
He goes for the big hit, but finds #KuldeepYadav in the deep as #WashingtonSundar picks up another crucial wicket for India 👏🇮🇳#INDvAFG | Only Test ➡️ DAY 3 | LIVE NOW 👉 https://t.co/jzjg5vVQq5 pic.twitter.com/XVd3rvlzlb
— Star Sports (@StarSportsIndia) June 8, 2026
తాజావార్తలు
-
IND vs AFG: ముల్లన్‌పూర్‌లో భారత్ మర్చిపోలేని మ్యాజిక్.. ఆఫ్ఘన్‌పై 300 పరుగుల తేడాతో విజయం!
-
‘OG India Tour’: తమన్ ‘OG ఇండియా టూర్’.. ఈ శనివారం నుంచే హైదరాబాద్‌లో లైవ్ కన్సర్ట్ షురూ!
-
Iran-US War: 100 రోజులు పూర్తి చేసుకున్న యుద్ధం.. హార్ముజ్ తెరుచుకోకపోతే తీవ్ర సంక్షోభమే!
-
West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
-
Telangana Monsoon : తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాల జోరు షురూ..!
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!