IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing 11 vs WI 2nd ODI: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే బుధవారం (సెప్టెంబర్ 30) గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. జియోహాట్‌స్టార్ యాప్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డేలో కూడా గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని గిల్ సేన భావిస్తోంది. మరోవైపు సిరీస్‌ను సమం చేయాలంటే వెస్టిండీస్‌కు ఈ మ్యాచ్‌లో విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి.
సేమ్ కాంబినేషన్:
తొలి వన్డేలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. ప్రసిద్ధ్ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ అజేయంగా 139 పరుగులతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 110 పరుగులతో సెంచరీ సాధించాడు. రోహిత్ శర్మ 32 పరుగులు చేయగా.. రుతురాజ్ గైక్వాడ్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దాంతో తొలి వన్డేలో విజయాన్ని అందించిన కాంబినేషన్‌ను కొనసాగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా ఆడనుండగా.. మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ ఆడనున్నారు. ఆపై నమన్ ధీర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజాలు ఆల్రౌండర్లుగా ఆడుతారు. గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణలు బౌలింగ్ కోటాలో బరిలోకి దిగనున్నారు. దాంతో యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, మహ్మద్ సిరాజ్, అకిబ్ నబీలకు నిరాశ తప్పదు.
Also Read
- Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Praveen Kumar: ఏదైనా చేయాలనుంది.. కీలక పదవికి దరఖాస్తు చేసిన టీమిండియా మాజీ పేసర్!
- Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
వారిపైనే విండీస్ ఆశలు:
తొలి వన్డేలో బ్యాటింగ్‌లో రాణించినా.. బౌలింగ్‌లో వెస్టిండీస్ విఫలమైంది. సిరీస్‌ను సమం చేయాలంటే విండీస్ తమ బౌలింగ్‌ను మరింత మెరుగుపరుచుకోవాల్సి ఉంది. భారీగా రన్స్ ఇచ్చిన అల్జారీ జోసెఫ్, రోస్టన్ చేజ్, గుడాకేశ్ మోటీలు పరుగులు కట్టడి చేయాల్సి ఉంది. మొదటి వన్డేలో ఓపెనర్లు జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, అమీర్ జాంగూ చెలరేగారు. ఈ ముగ్గురిపై విండీస్ మరోసారి ఆశలు పెట్టుకుంది.
పిచ్ రిపోర్ట్:
బర్సాపరా క్రికెట్ స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు సుమారు 332 పరుగులు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ పేసర్లకు కూడా కొంత సహకారం లభించే అవకాశం ఉంది. గువాహటి మైదానంలో లక్ష్య ఛేదనకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఛేజింగ్ చేసిన జట్ల విజయశాతం 60 శాతంగా ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉండనుంది. ఉష్ణోగ్రత 28 డిగ్రీలుగా ఉండటంతో పాటు ఆకాశం నిర్మలంగా ఉండనుంది.
హెడ్ టు హెడ్ రికార్డు:
భారత్, వెస్టిండీస్ జట్లు వన్డేల్లో ఇప్పటివరకు 137 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 73 విజయాలు సాధించగా.. వెస్టిండీస్ 64 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇటీవలి కాలంలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి వన్డేలోనూ టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో గువాహటి మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, నామన్ ధీర్, రవీంద్ర జడేజా, నితీశ్ కుమార్ రెడ్డి, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.
వెస్టిండీస్: జాన్ క్యాంప్‌బెల్, జస్టిన్ గ్రీవ్స్, కీసీ కార్టీ, షాయ్ హోప్, అమీర్ జాంగూ, జ్యువెల్ ఆండ్రూ, రోస్టన్ చేజ్, మాథ్యూ ఫోర్డ్, గుడాకేశ్ మోటీ, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్.
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!