Common Wealth Games 2022: పాకిస్థాన్ ఢమాల్.. భారత్ ముందు 100 పరుగుల టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Common Wealth Games 2022: ఇంగ్లండ్‌లోని బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మహిళల క్రికెట్ పోటీలలో భాగంగా ఆదివారం నాడు భారత్-పాకిస్థాన్ హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతుండటంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే ఉంది. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. వరుణుడి కారణంగా ఈ మ్యాచ్‌ను 18 ఓవర్లకు అంపైర్లు కుదించారు. ఈ మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 18 ఓవర్లలో 99 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత మహిళల ముందు 100 పరుగుల టార్గెట్ నిలిచింది.
Read Also: Danish Kaneria: పాకిస్థాన్ మాజీ బౌలర్ సందేహాలు.. ఆసియా కప్‌కు కూడా కోహ్లీని పక్కన పెడతారేమో?
Also Read
- Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
- Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు నమ్మకం లేదు.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
- Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్‌పై భారీ విజయం.!
పాకిస్థాన్ ఓపెనర్ మునీబా అలీ 32 పరుగులు చేసింది. జట్టులో ఆమె టాప్ స్కోరర్. మరో ఓపెనర్ జావేద్‌ను భారత బౌలర్ మేఘనా సింగ్ డకౌట్ చేసింది. పాకిస్థాన్ కెప్టెన్ బిస్మా 17 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది. ఒమైమా సొహైల్ (10), అయేషా నసీమ్ (10), అలియా రియాజ్ (18) ఎక్కువ సేపు నిలబడలేకపోయారు. పాకిస్థాన్ జట్టు ముఖ్యంగా చివరి 8 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో స్నేహ్ రానా 2 వికెట్లు, రాధా యాదవ్ 2 వికెట్లతో ఆకట్టుకున్నారు. రేణుకా సింగ్, మేఘనా సింగ్, షెఫాలీ వర్మ తలో వికెట్ సాధించారు. కాగా తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం చాలా ముఖ్యం.
తాజావార్తలు
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి