Hockey: ఆసియా కప్‌లో అద్భుతం చేసిన భారత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్ హాకీలో గురువారం ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ చెలరేగింది. 16-0 గోల్స్ తేడాతో ఇండోనేషియాను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇండియా ఫస్ట్ ఆఫ్‌లో 6-0తో ముందంజలో నిలవగా.. సెకండ్ ఆఫ్‌లో భారత ఆటగాళ్ల మరింత రెచ్చిపోయారు. దీంతో మ్యాచ్ ముగిసే సమయానికి 16 గోల్స్ కొట్టారు. ఈ విజయంతో భారత్ సూపర్-4కు అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అద్భుతం చేసిందనే చెప్పాలి. సూపర్-4 దశకు చేరుకోవడానికి భారత్ 15 గోల్స్ తేడాతో గెలవాల్సి ఉంది. కానీ ఆతిథ్య ఇండోనేషియాతో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 16 గోల్స్ చేసి హాకీ ప్రపంచాన్నే భారత్ నివ్వెరపరిచింది.
IPL 2022: రికార్డు బద్దలు కొట్టిన లక్నో-బెంగళూరు మ్యాచ్
Also Read
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
- Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ఈ మ్యాచ్‌లో ఒకవేళ భారత్ కనీసం 15 గోల్స్ తేడాతో గెలవకపోయి ఉంటే సూపర్-4 బెర్తు పాకిస్థాన్ వశం అయ్యేది. ఎందుకంటే గత మ్యాచ్‌లో భారత్-పాక్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. మరోవైపు జపాన్ చేతిలో భారత్ 2-5తో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కంటే మెరుగైన గోల్ రేట్ సాధిస్తేనే భారత్‌కు సెమీస్ ఛాన్స్ ఉందని సమీకరణాలు స్పష్టం చేశాయి. అయితే ఇండోనేషియాతో మ్యాచ్‌లో భారత్ అదరగొట్టి అభిమానుల మనసులను కూడా గెలుచుకుంది. కాగా ఇప్పటికే సూపర్-4 దశకు జపాన్, మలేషియా, దక్షిణ కొరియా జట్లు చేరుకున్న సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్లో భారీ పతనం.. నేడు ఒక్కరోజే రూ.4 లక్షల కోట్లకు పైగా ఆవిరి..
-
Mandadi : 100 కోట్ల క్లబ్లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్
-
Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.!
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!