Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
All Eyes on Virat Kohli and Rohit Sharma in Guwahati: భారత్, వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండో మ్యాచ్ గువాహటిలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో మరికొన్ని గంటల్లో జరగనుంది. ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అందుకు కారణం మాజీ కెప్టెలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. 2027 వన్డే ప్రపంచ కప్‌కు ముందు తమ కెరీర్లో చివరి దశలో ఉన్న ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్ల ప్రదర్శనపై అందరి దృష్టి ఉంది.
గువాహటి రోహిత్ శర్మకు ఎంతో కలిసొచ్చిన మైదానం. హిట్‌మ్యాన్ ఇప్పటివరకు రెండు వన్డేలు ఆడి 235 పరుగులు చేశాడు. 235.00 సగటు, 127.71 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేసిన రోహిత్.. ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ బాదాడు. వెస్టిండీస్‌పై 2018లో 117 బంతుల్లో అజేయంగా 152 పరుగులు చేయడం గువాహటిలో హిట్‌మ్యాన్ అత్యుత్తమ స్కోరు. మరోవైపు రోహిత్ ఓ అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. వన్డేల్లో 12 వేల పరుగుల మార్క్‌ను అందుకున్న మూడో భారత బ్యాటర్‌గా నిలవడానికి అతడు మరో 73 పరుగులు మాత్రమే చేయాలి. ప్రస్తుతం 289 వన్డేల్లో 281 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ 11,927 పరుగులతో ఉన్నాడు. 48.88 సగటుతో పాటు 34 సెంచరీలు, 62 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 264. ఈ ఏడాది 10 వన్డేల్లో రోహిత్ 411 పరుగులు చేశాడు. 41.10 సగటు, 98.56 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన హిట్‌మ్యాన్.. ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ బాదాడు. ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ మైదానంలో చేసిన 138 పరుగుల ఇన్నింగ్స్ ఈ ఏడాది అతడి అత్యుత్తమ ప్రదర్శనల్లో ఒకటి. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 35 బంతుల్లో 32 పరుగులు చేసిన రోహిత్.. గువాహటిలో ఈసారి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచాలని చూస్తున్నాడు.
Also Read
- India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
- IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
- IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
- Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
అసోం గడ్డపై విరాట్ కోహ్లీ రికార్డు మరింత ప్రత్యేకంగా ఉంది. ఈ రాష్ట్రంలో మూడు వన్డేల్లోనూ సెంచరీలు చేశాడు. నెహ్రూ స్టేడియం, బర్సాపరా స్టేడియాల్లో వరుసగా మూడు సెంచరీలు నమోదు చేశాడు. 2010లో న్యూజిలాండ్‌పై 110 పరుగులు చేసిన కోహ్లీ.. ఆ తర్వాత 2018లో వెస్టిండీస్‌పై అజేయంగా 140 పరుగులు చేశాడు. 323 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించిన ఆ మ్యాచ్‌లో కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 2023 జనవరిలో గువాహటిలో శ్రీలంకతో జరిగిన వన్డేలోనూ కోహ్లీ సెంచరీతో మెరిశాడు. 87 బంతుల్లో 113 పరుగులు చేసిన అతడు భారత్ విజయానికి కీలకంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఆ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన కోహ్లీ.. ఆ తర్వాత వన్డే ఫార్మాట్లో అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాడు.
అసోంలో ఇప్పటివరకు మూడు వన్డేలు ఆడిన విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లోనూ సెంచరీలు బాదాడు. మొత్తం 358 పరుగులతో 119.33 సగటు, 120.13 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 140 పరుగులు. దీంతో గువాహటి మరోసారి కోహ్లీ బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ ఏడాది వన్డేల్లోనూ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 523 పరుగులు చేశాడు. 87.16 సగటుతో పాటు 116కు పైగా స్ట్రైక్‌రేట్‌తో ఆడిన కోహ్లీ.. రెండు సెంచరీలు, మూడు అర్ధ సెంచరీలు చేశాడు. వెస్టిండీస్‌తో తొలి వన్డేలో 88 బంతుల్లో అజేయంగా 139 పరుగులు చేసిన కోహ్లీ.. గువాహటి మ్యాచ్‌కు కూడా అదే జోరుతో సిద్ధమవుతున్నాడు. గువాహటి వేదికగా రోహిత్ శర్మ 12 వేల వన్డే పరుగుల మైలురాయికి చేరువలో ఉండగా.. కోహ్లీ అసోంలో తన సెంచరీల పరంపరను కొనసాగించేందుకు బరిలోకి దిగుతున్నాడు. రెండో వన్డేలో ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్ల ప్రదర్శన మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!