IND vs SA: సఫారీలతో తొలి T20లో బరిలోకి దిగే భారత జట్టు ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమారు రెండున్నర నెలలపాటు అలరించిన IPL 2022 సీజన్ దిగ్విజయంగా ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి అప్‌కమింగ్ భారత్-సౌతాఫ్రికా T20 సిరీస్‌పై నెలకొంది. సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకున్న వేళ ఐపీఎల్‌లో మెరిసిన స్టార్లతో టీమిండియా సొంతగడ్డపై సఫారీలతో అమీతుమీ తేల్చుకోనుంది. 5 T20ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య జూన్ 9న ఢిల్లీ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.
ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న T20 ప్రపంచకప్‌కు ఈ సిరీస్‌ను టీమిండియా సన్నాహకంగా భావిస్తోంది. IPL లో మెరిసిన స్టార్ల సత్తాను పరీక్షించాలనుకుంటుంది. ఈ క్రమంలోనే సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్, కోహ్లీ, బుమ్రా, ఉమేశ్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చిన భారత సెలెక్షన్ కమిటీ 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ విశ్రాంతి నేపథ్యంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టును నడిపించనున్నాడు. సీనియర్ ఆటగాళ్లు లేని వేళ టీమ్ కాంబినేషన్ ఎలా ఉంటుందా? అనేదానిపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది.
Also Read
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ సెలబ్రేషన్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ ఇదే.. అందరినీ ఏడిపించేశాడుగా..
- IPL 2026: RCB ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్‌మెన్ ఎంట్రీ..
ఇక ఓపెనర్లుగా కెప్టెన్ KL రాహుల్, ఇషాన్ కిషన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఐపీఎల్ సెకండాఫ్‌లో అదరగొట్టిన రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించాలనుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ బెంచ్‌కు పరిమితమవుతాడు. ఫస్ట్ డౌన్‌లో శ్రేయస్ అయ్యర్ ఆడటం ఖాయం. ఐపీఎల్‌లో అయ్యర్ ఆశించిన రీతిలో రాణించకపోయినా.. అతనికి పోటీ లేదు. అయ్యర్‌ను కాదని దీపక్ హుడా ఆడించే సాహసం టీమ్ మేనేజ్‌మెంట్ చేయకపోవచ్చు. ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న రిషభ్ పంత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఐపీఎల్‌లో ఘోరంగా విఫలమైన పంత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం. ఈ సిరీస్‌లో రాణిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా T20 ప్రపంచకప్ జట్టుకు ఎంపికవుతాడు.
IPL2022 సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు కెప్టెన్సీలో అదరగొట్టి టైటిల్ అందించిన గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. T20 ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్.. మళ్లీ ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక ఆర్‌సీబీ తరఫున ఫినిషర్‌గా దుమ్మురేపిన దినేశ్ కార్తీక్ సైతం మూడేళ్ల తర్వాత మళ్లీ టీమిండియా పిలుపును అందుకున్నాడు. T20 ప్రపంచకప్ ఆడాలంటే అతను ఈ సిరీస్‌లో రాణించడం చాలా ముఖ్యం. అయితే ఇప్పటికే వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్, ఇషాన్ కిషన్ జట్టులో ఉన్న నేపథ్యంలో కార్తీక్‌ను ఆడిస్తారా? అనేది సందేహం. కానీ అతని ప్రస్తుత ఫామ్‌ను పరిగణలోకి తీసుకుంటే అతన్ని పక్కనపెట్టే అవకాశం లేదు.
IPL 2022 సీజన్‌లో తనదైన వేగంతో ఆకట్టుకున్న ఉమ్రాన్ మాలిక్ ఈ సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పేస్‌కు అనుకూలంగా ఉంటే ఆసీస్ పిచ్‌లపై ఉమ్రాన్ జట్టుకు వెపన్‌లా మారనున్నాడు. ఈ క్రమంలోనే అతనికి వీలైనన్ని అవకాశాలు ఇవ్వనున్నారు. భువనేశ్వర్ కుమార్ పేస్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. భువీకి తోడుగా హర్షల్ పటేల్ ఆడనున్నాడు.
తుది జట్టు(అంచనా):
KL రాహుల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్/ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), హార్దిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్/అర్షదీప్ సింగ్
తాజావార్తలు
-
KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్‌లో హైవోల్టేజ్ పోరు: టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
-
iQOO 15T: ఐకూ 15T విడుదల.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్
-
RBI: ఈఎంఐ కట్టలేదని ఫోన్ బ్లాక్ చేస్తున్నారా..? బ్యాంకులకు ఆర్బీఐ వార్నింగ్.. ఇకపై అలా చేస్తే కుదరదు..
-
TGPSC : నిరుద్యోగులకు డబుల్ బెనిఫిట్.. వయోపరిమితి పెంపు.. తెలుగులో ఎగ్జామ్..!
-
ACB Raids : సస్పెండ్ అయినా తగ్గని లగ్జరీ.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో తనిఖీల్లో బయటపడ్డ కోట్లు..!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!