టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుది కూడా ఒకటి. ఈ ఇద్దరు కాంబోలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’, ‘అఖండ తాండవం’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించాయి. ప్రస్తుతం అఖండ 2 మూవీ థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అయితే అఖండ తాండవం రిలీజ్ అయిన వెంటనే.. మరోసారి ఈ సెన్సేషనల్ కాంబోలో సినిమా ఫిక్స్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ క్రేజీ కాంబినేషన్‌ను పట్టాలెక్కించడానికి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ రంగంలోకి దిగిందని అన్నారు. అంతేకాదు.. ఈపాటికే అనౌన్స్మెంట్ కూడా రావాల్సింది అని అన్నారు.
కట్ చేస్తే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో ఇప్పుడు ఎలాంటి సౌండ్ లేదు. అంతేకాదు బోయపాటి ఓ హిందీ సినిమా ప్లానింగ్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. డైరెక్ట్ బాలీవుడ్ ఫిల్మ్ చేయడానికి రెడీ అవుతున్నాడట బోయపాటి. అయితే హీరో ఎవరు?, నిర్మాత ఎవరు? అనే విషయాల్లో ఎలాంటి క్లూ లేదు. కానీ ఈసారి బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: The Raja Saab Runtime: తగ్గిన ‘ది రాజాసాబ్’.. ఫైనల్ రన్ టైం ఇదే!
ఈ లెక్కన బాలయ్య-బోయపాటి కాంబినేషన్ మరోసారి సెట్ అవడానికి కస్త సమయం పట్టేలా ఉందనే చెప్పాలి. ప్రస్తుతం తనకు ‘వీరసింహారెడ్డి’ లాంటి మాసివ్ హిట్ ఇచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్నాడు బాలయ్య బాబు. ఆ తర్వాత బాబీతో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. మరి బోయపాటితో ఐదో సినిమా ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి. ఒక్కటి మాత్రం పక్కా.. ఎప్పుడొచ్చిన బాలయ్య-బోయపాటి కాంబినేషన్ క్రేజ్ మామూలుగా ఉండదనే చెప్పాలి.