NTV Telugu Site icon

IND vs NZ Final: నేడే భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్.. గెలిచేదెవరో..!

Ind Vs Nz

Ind Vs Nz

IND vs NZ Final: ఛాంపియన్స్‌ ట్రోఫీలో రసవత్తర సమరానికి సమయం అసన్నమైంది. అన్ని లీగ్ మ్యాచ్‌ల్లోనూ నెగ్గి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత్.. రోజు జరిగే ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడబోతుంది. ఈ ట్రోఫీని దక్కించుకునేందుకు రోహిత్ సేనకు ఇదో మంచి అవకాశం అని చెప్పాలి. అయితే, న్యూజిలాండ్‌ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఆ టీమ్ ను ఓడించాలంటే తీవ్రంగా శ్రమించాల్సిందే. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్‌పై కివీస్‌కు మంచి గణంకాలు ఉన్నాయి. అదే నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనైతే ఆ జట్టు ఆధిక్యం 3-1తో ఉంది. మరోవైపు తన అన్ని మ్యాచ్‌లనూ దుబాయ్‌లో భారత్ ఆడడం వల్ల అదనపు ప్రయోజనం పొందుతోందంటూ ప్రచారం జరుగుతుంది. భారత్‌తో గ్రూప్‌ మ్యాచ్‌ ఆడిన న్యూజిలాండ్ కు ఇప్పటికే ఇక్కడ పరిస్థితులపై ఓ అవగాహన వచ్చింది. ఫైనల్లో స్పిన్నే మ్యాచ్‌ విజయాన్ని నిర్దేశించనుంది. స్పిన్‌ అనుకూల పరిస్థితులను ఉపయోగించుకున్న జట్టే పైచేయి సాధిస్తుంది. నలుగురు నాణ్యమైన స్పిన్నర్లతో ఈ విభాగంలో భారత్‌ బలంగా కనిపిస్తున్నప్పటికీ.. కివీస్ స్పిన్‌ బౌలింగ్ మెరుగ్గానే ఉంది.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఇక, దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ పోరు ప్రారంభం కానుంది. అయితే, పిచ్‌ మందకొడిగా ఉంటుంది అని క్రికెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. స్పిన్నర్లకు మంచి సహకారం లభిస్తుందని చెప్పుకొచ్చారు. ఈ పిచ్ పై పరుగులు చేయడం అంత తేలికేమీ కాదు.. 270-280 చేసినా.. మంచి స్కోరే అవుతుంది.. ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీలో దుబాయ్‌లో జరిగిన నాలుగు మ్యచ్‌ల్లో సగటు స్కోరు 246 మాత్రమే.

ఇరు జట్లు (అంచనా)
టీమిండియా: రోహిత్‌ శర్మ, శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, అక్షర్‌ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్/ వాషింగ్టన్ సుందర్, మహ్మద్ షమి, వరుణ్‌ చక్రవర్తి.

న్యూజిలాండ్‌: విల్‌ యంగ్, రచన్‌ రవీంద్ర, కేన్ విలియమ్సన్, మిచెల్, లేథమ్, ఫిలిప్స్, బ్రాస్‌వెల్, శాంట్నర్, జేమీసన్, హెన్రీ/డఫి, ఒరూర్క్‌.