Dhruv Jurel Record: కష్టాల్లోనూ గొప్ప పోరాటం.. చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Jurel Record: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత యువ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అద్భుత పోరాటంతో ఆకట్టుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లీ ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన జురెల్.. కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో తన వంతు పాత్ర పోషించాడు. 170 బంతుల్లో 14 ఫోర్లతో 88 పరుగులు చేసి కైల్ జేమీసన్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఆఖరి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.
ఈ ఇన్నింగ్స్‌తో న్యూజిలాండ్ గడ్డపై టెస్టుల్లో ఏడో స్థానం లేదా అంతకంటే దిగువన బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ధ్రువ్ జురెల్ రెండో స్థానానికి చేరాడు. ఈ జాబితాలో 2014లో వెల్లింగ్టన్లో 118 పరుగులు చేసిన అజింక్య రహానే అగ్రస్థానంలో ఉన్నాడు. జురెల్ 88 పరుగులతో రెండో స్థానంలో నిలవగా.. 1981లో ఆక్లాండ్‌లో 78 పరుగులు చేసిన సయ్యద్ కిర్మాణి మూడో స్థానంలో ఉన్నాడు. 2026లో వెల్లింగ్టన్లో 78 పరుగులు చేసిన జురెల్.. 1999లో హామిల్టన్‌లో 76 పరుగులు చేసిన జవగల్ శ్రీనాథ్ కూడా ఈ జాబితాలో ఉన్నారు.
Also Read
- IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
- Gurnoor Brar: డేల్ స్టెయిన్‌లా టెస్టుల్లో ఆధిపత్యం సాధిస్తా.. టీమిండియా పేసర్ కీలక వ్యాఖ్యలు..!
- Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
- Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
అంతేకాదు ఈ మ్యాచ్‌లో జురెల్, గుర్నూర్ బ్రార్ కలిసి తొమ్మిదో వికెట్‌కు చేసిన భాగస్వామ్యం కూడా రికార్డుల జాబితాలో చోటు సంపాదించింది. వీరిద్దరూ కలిసి 64 పరుగులు జోడించారు. న్యూజిలాండ్ గడ్డపై భారత జట్టు తరఫున తొమ్మిదో లేదా పదో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యాల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 1981లో ఆక్లాండ్‌లో సయ్యద్ కిర్మాణి, శివలాల్ యాదవ్ నెలకొల్పిన 105 పరుగుల భాగస్వామ్యం అగ్రస్థానంలో ఉంది. 1990లో ఆక్లాండ్‌లో మహమ్మద్ అజారుద్దీన్, అతుల్ వాసన్ చేసిన 86 పరుగుల భాగస్వామ్యం రెండో స్థానంలో ఉంది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులకు ఆలౌట్ కాగా.. న్యూజిలాండ్ 356 పరుగులు చేసింది. దీంతో కివీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ మూడో రోజు రెండో సెషన్ సమయానికి 6.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 22 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే 13 పరుగులతో క్రీజులో ఉండగా.. హెన్రీ నికోల్స్ బ్యాటింగ్‌కు వచ్చాడు. అప్పటికి న్యూజిలాండ్ ఆధిక్యం 132 పరుగులకు చేరింది. టీమిండియా బౌలర్లు త్వరగా వికెట్లు తీసి కివీస్‌ను కట్టడి చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
తాజావార్తలు
-
Dhruv Jurel Record: కష్టాల్లోనూ గొప్ప పోరాటం.. చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్!
-
Huawei Qingyun C7: Huawei కొత్త టాబ్లెట్ లాంచ్.. 10,100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లే
-
AP Panchayat Elections 2026: ప్రారంభమైన రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. 1170 సర్పంచ్, 19655 వార్డులు ఏకగ్రీవం!
-
IND vs NZ Test: కుప్పకూలిన భారత్.. 110 పరుగుల భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్.!
-
Jharkhand: ఆలయ దర్శనానికి వెళ్తుండగా విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!