తమిళ హీరో మాధవన్ కుమారుడు తండ్రికి తగ్గ తనయుడిగా సత్తా చాటుతున్నాడు. తండ్రి సినిమాల ద్వారా పేరు తెచ్చుకుంటే… తనయుడు స్విమ్మింగ్ ద్వారా ఖ్యాతి సంపాదిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే… హీరో మాధవన్ తనయుడు వేదాంత్‌కు చిన్ననాటి నుంచే స్విమ్మింగ్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ప్రత్యేకంగా శిక్షణ తీసుకుని స్విమ్మింగ్‌లో రాణిస్తున్నాడు. ఇటీవల నేషనల్ స్విమ్మింగ్ ఛాంపియన్ షిప్‌లో వేదాంత్ 7 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో త్వరలో ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనాలని భావిస్తున్నాడు.…