Mohammed Shami: ఏంటి రూ. 4 లక్షలు పెద్ద అమౌంట్ కాదా.. షమీకి సుప్రీంకోర్టు నోటీసులు!
- మరోసారి వార్తల్లో నిలిచిన టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ..
- తనకు రూ. 4 లక్షల భరణం సరిపోవడం లేదన్న షమీ మాజీ భార్య హసిన్ జహాన్..
- నాలుగు వారాల్లో సమాధానం తెలియజేయాలని మహమ్మద్ షమీకి సుప్రీంకోర్టు నోటీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Shami: టీమిండియా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి వార్తల్లో నిలిచారు. తనకు ఇస్తున్న భరణం సరిపోవట్లేదని అతడి మాజీ భార్య హసిన్ జహాన్ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. హసీన్ పిటీషన్‌ను విచారించిన కోర్టు షమీకి నోటీసులు ఇచ్చింది. నాలుగు వారాల్లో సమాధానం తెలియజేయాలని తెలిపింది. కోల్‌కాతా హైకోర్టు ఆదేశాల మేరకు హసీన్‌కు రూ. 4 లక్షలు భరణంగా షమీ చెల్లిస్తున్నాడు. ఇక, ఇందులో షమీ కూతురికి రూ. 2.5 లక్షలు, హసీన్‌కు రూ. 1.5 లక్షలు అందుతున్నాయి. అయితే, ఈ మొత్తం పరిహారం సరిపోవట్లేదని షమీపై హసీన్ మరోసారి కోర్టుకు పోయింది.
Read Also: Vande Mataram Row: వందేమాతరం గీతాన్ని నేను పాడలేను.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Also Read
- Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
- Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
- 2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
అయితే, గతంలోనూ ఇదే అంశంపై ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ హసీన్ హైకోర్టుకు వెళ్లింది. అక్కడ ఆమెకు లభించే భరణాన్ని రూ. 1.3 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచింది. తాజాగా ఈ మొత్తం కూడా సరిపోవట్లేదని సుప్రీంకోర్టును హసీన్ ఆశ్రయించింది. ఆమె తరఫున న్యాయవాదులు శోభా గుప్తా, శ్రీరామ్ పరాకట్ వాదిస్తూ.. షమీ చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నెలకు రూ. 1.08 కోటి ఖర్చు చేస్తాడు.. కానీ భార్య, కుమార్తెను పేదరికంలో విడిచి పెట్టాడు అని తెలిపారు. షమీ ఆస్తుల నికర విలువ సుమారు రూ. 500 కోట్ల వరకు ఉంటుంది.. హసీన్‌కు ఎలాంటి ఆదాయ వనరులు లేవు.. ఉద్యోగం చేసుకునే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి, షమీ తమ క్లయింట్‌కు ఇంకా రూ. 2.4 కోట్ల బకాయిలు చెల్లించాలి అన్నారు.
Read Also: CM Revanth Reddy : ORRను పల్లిబఠానీల లెక్క అమ్మేశారు కేసీఆర్
ఇక, లాయర్ల వాదన ముగిసిన తర్వాత న్యాయస్థానం హసీన్‌కు పరోక్షంగా చురకలు అంటించ్చినట్లు సమాచారం. నెలకు రూ. 4 లక్షల భరణం చాలా పెద్ద మొత్తం కదా అని క్వశ్చన్ చేశారని తెలుస్తుంది. అయితే, షమీ-హసీన్‌లు 2014లో పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు వీళ్లు కాపురం సజావుగా కొనసాగింది. వీరిద్దరికి ఓ అమ్మాయి జన్మించింది. అనంతరం షమీ- జహాన్ మధ్య విభేదాలు వచ్చాయి. అలాగే, 2018లో షమీపై హసీన్ గృహ హింస, వేధింపుల కేసు పెట్టింది. అప్పటి నుంచి వీరూ వేరువేరుగా నివాసం ఉంటున్నారు. ఈ ఏడాది జులైలో కోల్‌కతా హైకోర్టు రూ. 4 లక్షల భరణం హసీన్‌కు చెల్లించాలని మహ్మద్ షమీకి ఆదేశాలు ఇచ్చింది.
తాజావార్తలు
-
KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
-
Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
-
Smit Machchhar: ఆ టైమ్‌లో “హనుమాన్ చాలీసా” పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
-
Vettri Payanam: మహిళలకు గుడ్‌న్యూస్.. ఉచిత బస్సు ప్రయాణం విస్తరణ.. ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సులకూ వర్తింపు
-
Anant Ambani in AP: నన్ను కూడా ఆంధ్ర బిడ్డగా భావించండి.. అనంత్ అంబానీ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?