గత ఆదివారం భారత్ – పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను తర్వాత ఫిల్డింగ్ కూడా చేయలేదు. ఇక పాండ్య కు భుజం పైన గాయం కావడంతో నిన్న తడిని స్కానింగ్ కు తీసుకెళ్లారు. ఇక తాజాగా పాండ్య స్కానింగ్ రిపోర్ట్స్ రావడంతో భారత జట్టు యూక తర్వాతి మ్యాచ్ వరకు పాండ్య సిద్ధం అవుతాడు అని భావిస్తున్నట్లు ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. పాండ్య రిపోర్ట్స్ వచ్చాయి. అతనికి తగ్గిలింది పెద్ద గాయం కాదు. అయితే టీం ఇండియా తర్వాతి మ్యాచ్ వచ్చే ఆదివారం ఉంది. కాబట్టి ఆ మ్యాచ్ కు చాలా సమయం ఉండటంతో అతను కోలుకుంటాడు అని భావిస్తున్నట్లు తెలిపాడు. ఇక గత ఆదివారం పాకిస్థాన్ తో మొదటి మ్యాచ్ ఆడిన టీం ఇండియాకు వచ్చే ఆదివారం మళ్ళీ న్యూజిలాండ్ తో మ్యాచ్ ఉంది. అంటే మధ్యలో సరిగ్గా వరం రోజులు ఉంది. కాబట్టి పాక్ పై ఓడిపోయిన కోహ్లీ సేన ఈ గ్యాప్ లో తనతప్పులను సరిచేసుకొని కివీస్ పై విజయం సాధించాలని భావిస్తుంది.