Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardik Pandya Injury: గాయం నుంచి కోలుకుని తిరిగి టీమిండియాలోకి రావాలని చూస్తోన్న స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. హార్దిక్ మళ్లీ గాయపడినట్లు సమాచారం. దీంతో సెప్టెంబరు 13 నుంచి అఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు అతడు దూరమయ్యే అవకాశముంది. హార్దిక్ తాజా లెగ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హార్దిక్ పునరాగమనంపై మరోసారి సందేహాలు నెలకొన్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది.
బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో హార్దిక్ పాండ్యా గత కొంతకాలంగా ఫిట్నెస్, బౌలింగ్‌పై ముమ్మర సాధన చేస్తున్నాడు. పూర్తి తీవ్రతతో బౌలింగ్ చేస్తూ ఎలాంటి పెద్ద ఇబ్బంది లేకుండానే పురోగతి సాధిస్తున్న సమయంలో.. తాజాగా కాలిలో అసౌకర్యం తలెత్తినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం బౌలింగ్‌కు దూరంగా ఉండాలని అతడికి బీసీసీఐ వైద్య బృందం సూచించినట్లు తెలుస్తోంది. దాంతో అఫ్గానిస్థాన్‌తో జరగనున్న టీ20 సిరీస్‌కు హార్దిక్ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం బీసీసీఐ సెలెక్టర్లు సమావేశమై సిరీస్‌కు జట్టును ఎంపిక చేయనున్నారు. బెంగళూరు సీఓఈలో చికిత్స, రిహాబిలిటేషన్ కొనసాగిస్తున్న ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై కూడా సెలెక్టర్లు రిపోర్ట్స్ తీసుకోనున్నారు.
Also Read
- Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
- Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!
- Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
హార్దిక్ పాండ్యా పూర్తి తీవ్రతతో బౌలింగ్ చేస్తున్న సమయంలో పెద్దగా అసౌకర్యం కనిపించలేదు. అయితే కాలిలో స్వల్ప సమస్య రావడంతో కొంతకాలం బౌలింగ్‌ను ఆపేయాల్సి వచ్చింది. త్వరలోనే అతడు తిరిగి బౌలింగ్ ప్రారంభించే అవకాశం ఉన్నప్పటికీ.. అఫ్గానిస్థాన్ సిరీస్‌కు సమయం చాలా తక్కువగా ఉండటంతో అప్పటికి పూర్తి ఫిట్నెస్ సాధించడం కష్టమని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం హార్దిక్ బ్యాటింగ్, కదలికల్లో పెద్దగా సమస్యలు లేవు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించుకున్న తర్వాతే అతడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని సీఓఈ భావిస్తోంది.
హార్దిక్ పాండ్యా చివరిసారిగా 2026 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున మే 24న మ్యాచ్ ఆడాడు. భారత్ తరఫున చివరి మ్యాచ్ మార్చి 8న 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత గాయాల కారణంగా హార్దిక్ అఫ్గానిస్థాన్‌తో స్వదేశీ వైట్‌బాల్ సిరీస్‌తో పాటు ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనలకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు మళ్లీ పూర్తి ఫిట్నెస్ సాధించి జట్టులోకి రావాలని ప్రయత్నిస్తున్న సమయంలో తాజా లెగ్ సమస్య అతడి రీఎంట్రీని ఆలస్యం చేయనుంది. హార్దిక్ లేకపోవడం టీమిండియా కూర్పుపైనా ప్రభావం చూపవచ్చు.
తాజావార్తలు
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్‌లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
Hindu Temple Demolition: పాకిస్థాన్‌లో 125 ఏళ్ల పురాతన హిందూ ఆలయం కూల్చివేత.. హిందూ సంఘాల ఆందోళన!
-
OG 2 update : OG2 టైమ్ వచ్చింది.. కానీ డౌటే?
ట్రెండింగ్
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!