Hardik Pandya Creates Rare Record With Pakistan Match: టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన విషయం తెలిసిందే! బంతితో మాయ చేసి కీలక వికెట్లు తీయడమే కాకుండా.. కష్టాల్లో ఉన్న జట్టుని ఆదుకొని బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. తొలుత బౌలింగ్‌లో 4 ఓవర్లకు 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసినా పాండ్యా.. బ్యాటింగ్ ఇన్నింగ్స్‌లో విరాట్‌కి తోడుగా నిలిచి 40 పరుగులు చేశాడు. ఇలా ఆల్‌రౌండ్ షోతో రప్ఫాడించడంతో.. హార్దిక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో అత్యంత వేగంగా 1000 పరుగులు చేయడంతో పాటు 50 వికెట్లు తీసిన తొలి భారత ఆల్‌రౌండర్‌గా చరిత్రపుటలకెక్కాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే మాత్రం.. పాండ్యా ఆరో స్థానంలో ఉన్నాడు. తొలి ఐదు స్థానాల్లో వరుసగా.. డ్వేన్ బ్రావో (వెస్టిండీస్), షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్), మహ్మద్ హాఫీజ్ (పాకిస్తాన్), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్), కెవిన్ ఓబ్రెయిన్ (ఐర్లాండ్), మహ్మద్ నబీ (ఆఫ్ఘనిస్తాన్) ఉన్నారు.
అంతేకాదు.. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా కలిసి ఐదో వికెట్‌కి జోడించిన 113 పరుగుల భాగస్వామ్యం కూడా టీ20ల్లో టీమిండియాకు అత్యధికం. ఈ భాగస్వామ్యం వల్లే.. పీకల్లోతు కష్టాల్లో ఉన్న భారత జట్టు గట్టెక్కింది. పాకిస్తాన్ కుదిర్చిన 160 లక్ష్యాన్ని చేధించి, అద్భుత విజయాన్ని సొంతం చేసుకోగలిగింది. కాగా.. హార్దిక్ పాండ్యా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ అద్భుతంగా రాణించాడు. గాయం కారణంగా కొన్నాళ్లు క్రికెట్‌గా దూరంగా ఉన్న ఇతగాడు.. ఐపీఎల్ టోర్నీతో కంబ్యాక్ ఇచ్చాడు. గుజరాత్ జట్టుకి నాయకత్వం వహించిన ఇతగాడు.. కెప్టెన్‌గా అరంగేట్రం ఇచ్చిన మొదట్లోనే ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకొని, చరిత్ర నెలకొల్పాడు. అంతేకాదు.. ఐర్లాండ్‌తో సిరీస్ ఆడిన భారత జట్టుకి కూడా కెప్టెన్సీ వహించి, సమర్థవంతంగా ముందుండి నడిపించాడు. ఇతర లీగ్ మ్యాచెస్‌లో కూడా అద్భుత ప్రదర్శనల్ని కనబర్చిన హార్దిక్.. అదే ఫామ్‌ను కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు.