GT vs PBKS: లక్ష్యంవైపు దూసుకెళ్తున్న గుజరాత్.. 10 ఓవర్లలో పరిస్థితి ఇది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gujarat Titans Scored 80 Runs In 10 Overs: పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్.. లక్ష్యంవైపు దూసుకెళ్తోంది. మొదటి నుంచే పరుగుల వర్షం కురిపించడం మొదలుపెట్టింది. ఆరు ఓవర్ల పవర్ ప్లేలో ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్ ఎడాపెడా బౌండరీలు బాదేశారు. అయితే.. 48 పరుగుల వద్ద ఒక షాట్ కొట్టబోయి సాహా ఔటయ్యాడు. రబాడా వేసిన టెంప్టింగ్ బంతిని భారీ షాట్‌గా మలిచేందుకు ప్రయత్నించగా.. అది గాల్లోకి ఎగిరి, బౌండరీ లైన్ వద్ద నేరుగా ఫీల్డింగ్ చేతికి చిక్కింది. దీంతో.. సాహా (30) పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అయితే.. సాహా ఔటయ్యాక గుజరాత్ జోరు కాస్త నెమ్మదించింది. సాయి సుదర్శన్ భారీ షాట్ల జోలికి వెళ్లకుండా, ఆచితూచి ఆడుతున్నాడు. మరోవైపు.. శుభ్‌మన్ గిల్ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతున్నాడు.
Also Read
- Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్‌రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
- Rohit Sharma-ODI WC: 2027 వరల్డ్‌కప్‌లో రోహిత్ శర్మ ఆడటం కష్టమేనా?.. బీసీసీఐకి బిగ్ టెన్షన్!
- Ajinkya Rahane: "మా విజయ రహస్యం ఇదే".. కేకేఆర్ డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయటపెట్టిన కెప్టెన్ రహానే
- Hardik Pandya: "సాకులు చెప్పను.. మేం తప్పు చేశాం".. ముంబై వైఫల్యాలపై హార్దిక్ ఓపెన్ టాక్!

దీంతో.. మొదటి 10 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ ఒక వికెట్ నష్టానికి 80 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 74 పరుగులు చేయాల్సి ఉంటుంది. లక్ష్యం మరీ పెద్దది కాదు కాబట్టి.. గుజరాత్ సునాయాసంగానే దాన్ని ఛేధించే ఆస్కారం ఉంది. అందుకే.. బ్యాటర్లు భారీ షాట్ల జోలికి వెళ్లడం లేదు. ఒత్తిడికి గురయ్యేంత పరిస్థితి లేకపోవడంతో.. నిదానంగానే తమ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్, సాయి సుదర్శన్ మెరుగ్గా రాణిస్తున్నారు. ఇక పంజాబ్ బౌలర్ల విషయానికొస్తే.. రబాడా ఒక వికెట్ తీశాడు. మిగిలిన బౌలర్లు ఇంకా ఖాతా తెరువలేదు. అర్ష్‌దీప్ సింగ్ ఎక్కువ పరుగులే సమర్పించుకున్నాడు. మిగిలిన వాళ్లు పొదుపుగానే బౌలింగ్ వేశారు.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్‌రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!