GT vs DC : గుజరాత్ టైటాన్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ ఢీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వరుస విజయాలతో దూసుకుపోతూ ప్లేఆఫ్స్ రేసులో తొలి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్ ను ఢీకొనబోతున్నది. ఆడిన 8 మ్యాచ్‌లలో ఆరు గెలిచిన గుజరాత్‌ను అడ్డుకోవడం ఢిల్లీ టీమ్ కి ప్రస్తుతానికైతే శక్తికి మించిన పనే అని తెలుస్తోంది. అదీగాక ఈ మ్యాచ్ కూడా గుజరాత్ సొంత గ్రౌండ్ అహ్మదాబాద్‌లో జరుగుతుంది. గుజరాత్ ఈ సీజన్లో రాజస్తాన్ చేతిలో ఓడిన తర్వాత మళ్లీ వరుసగా మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టింది. 8 మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించిన పాండ్యా సేన.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాలలో పటిష్టంగా కనిపిస్తో్ంది. లక్నో సూపర్ జెయింట్స్ ఇచ్చిన 136 టార్గెట్ ను ఈజీగా గుజరాత్ గెలిచింది.
Also Read : Rains and Thunderstorms: ఈ జిల్లాల్లో నేడు వర్షాలు.. పిడుగులు పడే అవకాశం..!
Also Read
- Virat Kohli: "జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి".. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
- Akki On Fire: రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ ల వికెట్ల తీసిన ఆనందం.. నోట్ సెలబ్రేషన్ వైరల్.!
- Virat Kohli: "ప్రతి సీజన్‌ను నరకంలా అనుభవించాను".. 18 ఏళ్లుగా తన గుండెల్లోని బాధను బయటపెట్టిన కోహ్లీ..
- Video Viral: నాలుగు సిక్సర్ల తుఫాన్.. పూరన్‌కు వంగి సెల్యూట్ చేసిన ముకుల్.!
హార్ధిక్ పాండ్యా బ్యాటింగ్ లో విఫలమవుతున్నాడు.. తప్ప ఆ జట్టులో పెద్దగా వేలెత్తి చూపించడానికి లోపాలు కూడా ఏం లేవు. బ్యాటింగ్ శుబ్ మన్ గిల్, హార్ధిక్ పాండ్యా, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, డేవిడ్ మిల్లర్ లతో ఆ జట్టు పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్ లో షమీ, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, రషీద్ ఖాన్ లు దుమ్ము రేపుతున్నారు.
Also Read : Sri Mahishasura Mardini Stotram: మంగళవారం నాడు ఈ స్తోత్రాలు వింటే సకల పాపాలు సర్వనాశనమైపోతాయి
ఈ సీజన్ లో ఆడిన 8 మ్యాచ్ లలో రెండు మాత్రమే గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఇటీవలే సన్ రైజర్స్ చేతిలో చావుదెబ్బతింది. గుజరాత్ టీమ్ అన్ని విభాగాల్లో ఎంత పటిష్టంగా ఉందో ఢిల్లీ అంత వీక్ గా ఉంది. బ్యాటింగ్ లో డేవిడ్ వార్నర్ రాణిస్తున్నా గత మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. మిచెల్ మార్ష్, సాల్ట్ లు ఫామ్ ను అందుకుకున్నారు. ఈ ఇద్దరు ఫామ్ లోకి రావడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఆ తర్వాత వస్తున్న బ్యాటర్లందరూ ఏదో చుట్టపు చూపునకు వచ్చినట్టు వచ్చి పెవిలియన్ కు పోతున్నారు. అక్షర్ పటేల్ మీద ఆ జట్టు ఆశించినదానికంటే ఎక్కువ ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read : Sri Hanuman Chalisa: హనుమాన్ చాలీసా వింటే శత్రువులు సైతం మీకు అనుకూలంగా మారతారు
బౌలింగ్ లో కూడా అన్రిచ్ నోర్జే, కుల్దీప్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నా పెద్దగా ప్రభావం చూపడంలేదు. గత మ్యాచ్ లో మార్ష్ బౌలింగ్ లో కూడా నాలుగు వికెట్లు తీశాడు. అహ్మదాబాద్ గ్రౌండ్ అక్షర్ పటేల్ కు సొంత మైదానం.. మరి ఇక్కడ ఏమేరకు గుజరాత్ ను కట్టడి చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ లో కూడా ఓడితే ఢిల్లీ ఇక ఈ టోర్నీలో ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకున్నట్టే. అయితే ఈ రెండు జట్లు హెడ్ టూ హెడ్.. ఐపీఎల్ లో ఈ రెండు జట్ల మధ్య గత సీజన్ లో ఒకటి ఈ సీజన్ లో మరో మ్యాచ్ జరిగాయి. రెండింటిలోనూ గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
Also Read : Tirumala: కలకలం రేపిన ఈ-మెయిల్.. తిరుమలలో హై అలర్ట్..
అహ్మదాబాద్ స్టేడియం బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది. ఈ సీజన్ లో ఇక్కడ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 190 పరుగులకు పైగా నమోదైంది. ఛేదన చేసే జట్టుకు విజయావకాశాలెక్కువగా ఉన్నాయి.
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్), ఫిలిప్ సాల్ట్, మిచెల్ మార్ష్, మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, అక్షర్ పటేల్, రిపల్ పటేల్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జ్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్.

తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్‌లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్‌పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్‌కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..