GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్‌లో GT.. CSK అవుట్..!
- 229 పరుగుల భారీ స్కోర్‌తో చెలరేగిన గుజరాత్
- సాయి సుదర్శన్ – గిల్ విధ్వంసకర భాగస్వామ్యం
- సిరాజ్, రషీద్ దెబ్బకు కుప్పకూలిన చెన్నై
- టాప్-2లో GT.. టోర్నీ నుంచి CSK ఔట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) అద్భుత విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తో జరిగిన ఈ పోరులో గుజరాత్ బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి చెన్నైని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ టేబుల్లో టాప్-2 లో తన స్థానాన్ని అధికారికంగా ఖరారు చేసుకోగా, డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ టోర్నమెంట్ ప్రస్థానం ఈ ఓటమితో ముగిసింది.
టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆరంభం నుంచే చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. సాయి సుదర్శన్ కేవలం 53 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశారు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సైతం చెన్నై బౌలింగ్‌ను చీల్చిచెండాడుతూ 37 బంతుల్లోనే 64 పరుగులు చేసి అవుటయ్యాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 125 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అనంతరం వచ్చిన జోస్ బట్లర్ కేవలం 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో గుజరాత్ భారీ స్కోరు సాధించింది. చెన్నై బౌలర్లలో ముఖేష్ చౌదరి, స్పెన్సర్ జాన్సన్, అన్షుల్ కాంబోజ్ చెరో వికెట్ పడగొట్టినప్పటికీ పరుగులు భారీగా సమర్పించుకున్నారు.
Also Read
- Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
- Ind Vs NZ 5th T20: టాస్ గెలిచిన న్యూజిలాండ్.. టీమిండియా జట్టులోకి కీలక ప్లేయర్లు ఎంట్రీ..
- SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ ఖాతాలో చెత్త రికార్డులు.. భారత క్రికెట్లో మరో కొత్త చర్చ..
230 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మొదటి ఓవర్లోనే కోలుకోలేని షాక్ తగిలింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి బంతికే సంజూ శాంసన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (16) ను కూడా సిరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఉర్విల్ పటేల్ (0) ను కూడా అవుట్ చేసి సిరాజ్ చెన్నై పతనాన్ని శాసించాడు. ఆ తర్వాత మ్యాథ్యూ షార్ట్ (24) కొంతసేపు పోరాడినా రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కార్తీక్ శర్మ (19) దురదృష్టవశాత్తూ శుభ్‌మన్ గిల్ అద్భుత త్రోకు రనౌట్ అయ్యాడు.
మిడిలార్డర్లో శివమ్ దూబే కేవలం 17 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులు చేసి చెన్నై ఆశలు సజీవంగా ఉంచే ప్రయత్నం చేశాడు. అయితే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో గిల్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో దూబే ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత వచ్చిన అన్షుల్ కాంబోజ్ (19), డెవాల్డ్ బ్రెవిస్ (8)లను కూడా రషీద్ ఖాన్ ఒకే ఓవర్లో అవుట్ చేసి చెన్నైని కోలుకోకుండా చేశాడు. ఆఖర్లో కాగిసో రబడ వరుస బంతుల్లో నూర్ అహ్మద్ (1), స్పెన్సర్ జాన్సన్ (0)లను అవుట్ చేసి 14వ ఓవర్లోనే చెన్నై ఇన్నింగ్స్‌కు తెరదించాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, రబడ 2 వికెట్లతో రాణించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. ఎస్ఈసీ కార్యాలయంకు వైసీపీ నేతలు!
-
Ind vs NZ: హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన ఇషాన్, శ్రేయస్ అయ్యర్.. టీమిండియా స్కోర్ ఎంతంటే..
-
AP Cyclone Alert: ఏపీకి మరో తుపాను ముప్పు.. 3-4 రోజులు అతి భారీ వర్షాలు!
-
Rahul Gandhi: బీజేపీ బలవంతంగా దుకాణాలు మూసివేయించింది.. రాహుల్ సంచలన ఆరోపణలు!
-
GST Collection: జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
-
YS Jagan: ఓటర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు?.. RO చిన్నయ్యకు జగన్ మోహన్ రెడ్డి వినతిపత్రం..
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!