NTV Telugu Site icon

Umesh Yadav: టీమిండియా క్రికెటర్‌కు షాక్.. రూ.44 లక్షలకు టోకరా వేసిన స్నేహితుడు

Umesh Yadav

Umesh Yadav

Umesh Yadav: టీమిండియా క్రికెటర్ ఉమేష్ యాదవ్‌కు షాక్ తగిలింది. స్నేహితుడి చేతిలో ఉమేష్ యాదవ్ దారుణంగా మోసపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉమేష్ యాదవ్ టీమిండియాకు ఎంపికైన తర్వాత తన వ్యవహారాలను చూసుకునేందుకు తన స్నేహితుడు శైలేష్ ఠాక్రే(37)ను పర్సనల్ మేనేజర్‌గా అపాయింట్ చేసుకున్నాడు. శైలేష్‌‌తో తనకు ఎంతోకాలంగా స్నేహం ఉండటంతో ఉమేష్ ఇలా చేశాడు. అంతేకాకుండా ఉమేష్ తన స్నేహితుడికి ఆర్ధిక వ్యవహారాల పర్యవేక్షణ కూడా అప్పగించాడు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు, ఆదాయపన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ ఠాక్రేనే చక్కబెట్టేవాడు.

Read Also: Team India: మైదానంలోకి దూసుకెళ్లాడు.. రోహిత్ శర్మను కౌగిలించుకున్నాడు

కాగా ఉమేష్ యాదవ్ స్వస్థలం మహారాష్ట్రలోని నాగపూర్. తన స్నేహితుడు శైలేష్‌ది కోరాడి పట్టణం. ఈ నేపథ్యంలో నాగపూర్‌లోనే మంచి స్థలం అమ్మకానికి వచ్చిందని ఠాక్రే.. ఉమేష్‌కు చెప్పాడు. దాంతో ఆ స్థలం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించిన ఉమేశ్ యాదవ్ రూ.44 లక్షలను ఠాక్రే ఖాతాలో వేశాడు. అయితే ఠాక్రే ఆ ప్లాట్‌ను తన పేరిట కొనుగోలు చేశాడు. తనను ఠాక్రే దారుణంగా మోసం చేశాడని గుర్తించిన ఉమేష్ యాదవ్… తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని కోరాడు. అందుకు ఠాక్రే నిరాకరించడంతో ఉమేష్ పోలీసులను ఆశ్రయించాడు. కోరాడి పట్టణ పోలీసులు అతడి ఫిర్యాదును స్వీకరించి సెక్షన్ 406, సెక్షన్ 420 కింద ఠాక్రేపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు ఇంకా శైలేష్‌ను అరెస్ట్ చేయలేదని సమాచారం.