Football Player Pele: ఫిఫా కీలక నిర్ణయం.. ప్రతి దేశంలో ఫుట్‌బాల్ స్టేడియానికి పీలే పేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Football Player Pele: 20వ శతాబ్దంలో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడు ఎవరు అంటే అందరూ పీలే పేరు చెప్పి తీరాల్సిందే. అయితే ఇటీవల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. పీలే మరణంపై ఫిఫా కూడా సంతాపం తెలిపింది. పీలే మరణ వార్త విన్న తర్వాత జ్యూరిచ్‌లోని ఫిఫా ప్రధాన కార్యాలయంలో అన్ని దేశాల జెండాలను కిందకు దించి ఎగరేసింది. పుట్‌బాల్ ప్రపంచానికి పీలే మరణం తీరని లోటు అని ఫిఫా పేర్కొంది. అనంతరం ఫిఫా కీలక ప్రకటన చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒక ఫుట్‌బాల్ స్టేడియానికి పీలే పేరు పెట్టాలని ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్ఫాంటినో సూచించారు. ఈ మేరకు అన్ని దేశాలు నిర్ణయం తీసుకోవాలని కోరారు.
Read Also: Parliament Budget Session : జనవరి 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
Also Read
- Indian Fast Bowler: గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే సామర్థ్యం.. ఇండియాకు దొరికిన అద్భుత బౌలర్..
- BCA: క్రికెటర్లను అందించే పవర్ హౌస్‌గా మారుతున్న బిహార్ క్రికెట్ అసోసియేషన్.. మరో వైభవ్ వెలుగులోకి..
- England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
- Vaibhav Batting: ‘నా బౌలింగ్‌లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్‌కు బౌలింగ్ వేయలేను’..
కాగా ఫుట్‌బాల్ చరిత్రలో మూడు సార్లు ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన ఏకైక ఆటగాడు పీలే. తాజాగా ముగిసిన ఫిఫా వరల్డ్ కప్‌లో కూడా బ్రెజిల్ ఆటగాళ్లు పీలేను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఆస్పత్రిలో కేన్సర్‌తో పోరాడుతున్న పీలే త్వరగా కోలుకోవాలంటూ బ్యానర్‌తో ప్రదర్శన చేశారు. కానీ 82 ఏళ్ల పీలే కేన్సర్‌తో పోరాడుతూ గత సోమవారం నాడు తుదిశ్వాస విడిచారు. బంతి మైదానంలో పారాడితే కాళ్లతో డ్రిబ్లింగ్… గాల్లో ఉంటే ఛాతీతో కంట్రోల్.. గోల్‌పోస్ట్ వద్ద ఎగిరొస్తే హెడర్.. కింది నుంచి పాస్ అయితే చక్కని కిక్ షాట్… ఇలా బంతి ఎటునుంచి వచ్చినా.. తన చుట్టు అడుగడుగునా ప్రత్యర్థులు మాటువేసినా.. డిఫెండర్లు గోడ కట్టినా.. గోల్ కీపర్ కంచెలా నిలుచున్నా.. పీలే కచ్చితమైన లక్షిత షాట్‌ను ఎవరూ అడ్డుకోలేదు. అంతటి నైపుణ్యం పీలే సొంతం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Prabhas: ప్రభాస్ ఇటలీ విల్లా రెంట్ ఎంతో చెప్పిన ప్రభాస్ శ్రీను!
-
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
-
Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
-
Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
-
Indian Fast Bowler: గంటకు 160 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరే సామర్థ్యం.. ఇండియాకు దొరికిన అద్భుత బౌలర్..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!