Radhika Yadav: టెన్నిస్ ప్లేయర్‌ను తండ్రి ఎందుకు చంపాడు? విచారణలో ఏం తేలిందంటే..!
- టెన్నిస్ ప్లేయర్ (25) రాధిక యాదవ్ హత్య
- విచారణలో కీలక విషయాలు వెల్లడించిన నిందితుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ ప్లేయర్ రాధిక యాదవ్ (25) హత్యకు గురైంది. సొంత కన్నతండ్రి దీపక్ యాదవ్ చేతిలోనే అత్యంత దారుణంగా చంపబడింది. కని పెంచి పెద్ద చేసిన చేతులతోనే బిడ్డ ప్రాణాలు తీశాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. అంతగా తండ్రి చంపడానికి గల కారణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిందితుడు దీపక్ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: The Paradise : ది ప్యారడైజ్‌కి డబుల్ ట్రీట్..
Also Read
- Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
- Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
- Gautam Gambhir: లైక్స్, వ్యూస్ కాదు.. ట్రోఫీలే ముఖ్యం.. విమర్శకులకు గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్
- AUS vs BAN: కన్నెర్ర చేసిన మిచెల్ స్టార్క్.. 64 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌట్..!
రాధిక యాదవ్ రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి. పలు టోర్నమెంట్స్‌లో మెడల్స్ సాధించి కుటుంబానికి, ఆ ప్రాంతానికి కీర్తిని తెచ్చిపెట్టింది. అయితే గురువారం ఉదయం వంట గదిలో రాధిక అల్పాహారం సిద్ధం చేస్తుండగా వెనుక నుంచి లైసెన్స్ తుపాకీతో తండ్రి దీపక్ యాదవ్ ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. మూడు బుల్లెట్లు లోపలికి దూసుకెళ్లడంతో ప్రాణాలు వదిలింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించి.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో పై ఏకంగా రూ.19,701 భారీ డిస్కౌంట్..!
అయితే ఈ హత్యకు ఏడాది క్రితమే బీజం పడినట్లుగా తెలుస్తోంది. ఏడాది క్రితం రాధిక ఒక మ్యూజిక్ వీడియో చేసింది. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం బంధువుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. అంతేకాకుండా సొంతూరుకి వెళ్లినప్పుడల్లా.. కూతురు ఆదాయంతో బతుకుతున్నావని హేళన చేయడం రుచించలేదు. దీనిపై చాలా రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అలాగే మ్యూజిక్ వీడియోపై కూడా రభస నడుస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడంతో ఆమె ఆర్థికంగా బలపడింది. ఆమె ఎవరినీ లెక్క చేయకుండా స్వేచ్ఛగా విహరిస్తోంది. ఈ వ్యవహారం తండ్రిని ఎంతగానో బాధపెట్టింది. దీంతో కుమార్తెను చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. గురువారం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో వంటగదిలో రాధిక టిఫిన్ రెడీ చేస్తుండగా తండ్రి వెనుక నుంచి ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. విచారణంలో కుమార్తెను తానే చంపినట్లుగా దీపక్ యాదవ్ (49) అంగీకరించాడు.
పోలీసుల కథనం ప్రకారం.. కుమార్తె సంపాదనపై ఆధారపడి జీవించినందుకు స్వస్థలమైన వజీరాబాద్‌లోని గ్రామస్తులు పదే పదే ఎగతాళి చేశారని, ఆమె నడిపే టెన్నిస్ అకాడమీని మూసివేయాలని ఆమెను చాలాసార్లు కోరానని.. అందుకు అంగీకరించకపోవడంతో చంపేసినట్లుగా అధికారులకు దీపక్ చెప్పాడు.
కాల్పుల శబ్దం విని వెంటనే ఆమె మామ కుల్దీప్ యాదవ్ రూమ్‌లోకి వచ్చేటప్పటికీ విగతజీవిగా పడి ఉన్న రాధికను ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే రాధిక కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. కానీ ఎవరూ ఆమెను పట్టించుకోలేదు. పోలీసుల విచారణలో ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకున్నారు.
తాజావార్తలు
-
1984 Anti-Sikh Riots: “సజ్జన్ కుమార్ హీరోనా.?” రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని సిక్కుల ఆందోళన..
-
Duleep Trophy 2026: వైభవ్ సూర్యవంశీ చెలరేగుతాడా?.. షమీ, పృథ్వీ, సర్ఫరాజ్‌లకు కీలక పరీక్ష..
-
Tollywood: టాలీవుడ్ కు లాభాలే లాభాలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!