ఇంగ్లండ్-భారత్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్ లో నేడు తొలి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. అయితే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు టీమిండియా బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా చుక్కలు చూపించాడు. ఏకంగా 6 వికెట్లను తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అయితే.. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆరంభంలో తడబడ్డారు. మొదటి వికెట్‌ను 6 పరుగల వద్దే సమర్పించుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లు.. అది కొనసాగుతూ వచ్చింది.
దీంతో 110 పరుగులకే అందరూ పెవిలియన్ చేరారు. వన్డే మ్యాచ్ అయినప్పటికీ టీ20లా ఆడారంటూ ఇప్పటికే.. నెట్టంట్ల కామెంట్ల వర్షం కురుస్తోంది. 25.2 ఓవర్లకు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడంతో.. టీమిండియా టార్గెట్ 111గా ఉంది. అయితే.. టీమిండియాకు స్వల్ప స్కోర్ అయినప్పటికీ వర్ష సూచన నేపథ్యంలో కొంత టెన్షన్ మొదలైంది.