Anil Kumble: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి రోజు టీమిండియా తరపున ఆడుతున్న తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి హీరో అనడంలో ఎలాంటి సందేహమే లేదని భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసించారు. జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆరంభంలో వికెట్లు తీయలేకపోయారు.. కానీ, బౌలింగ్ కు రావడంతోనే ఒకే ఓవర్లో ఇంగ్లాండ్ ఓపెనర్లను నితీశ్ వెనక్కి పంపాడని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆతిథ్య జట్టు బ్యాటింగ్ నెమ్మదిగా కొనసాగిందన్నారు. జో రూట్, బెన్ స్టోక్స్ లాంటి టాప్ బ్యాటర్లను కూడా నితీశ్ తన బౌలింగ్‌తో చాలా ఇబ్బంది పెట్టాడని కొనియాడారు. అలాగే, నితీశ్ కుమార్ విషయంలో వేటు వేయడం, మార్పులు చేయడం చేయొద్దని బీసీసీఐకి అనిల్ కుంబ్లే కీలక సూచనలు చేశారు.
Read Also: MLA Rajasingh: రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ..!
అయితే, నితీశ్ కుమార్ బౌలింగ్‌ను చూసి సర్ప్రైజ్కు గురయ్యాను అని అనిల్ కుంబ్లే తెలిపారు. స్లోగా కరెక్ట్ ప్రదేశంలో బంతిని సంధించాడు.. తొలి వికెట్ లెగ్‌సైడ్ గిఫ్ట్‌గా వచ్చిందనుకున్నప్పటికీ.. రెండోది మాత్రం అద్భుతమైన డెలివరీతోనే ఔట్ చేశాడని పేర్కొన్నారు. జాక్ క్రాలీకి చక్కటి బంతి వేయడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయాడని తెలిపాడు. జడేజా బౌలింగ్‌లో పోప్ ఇచ్చిన క్యాచ్‌ను ధ్రువ్ జురేల్ మంచిగా పట్టుకోవడంతో పాటు బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఎక్కువ వికెట్లు రాలేదన్నారు. బుమ్రాను అడ్డుకోవడంపై ఇంగ్లాండ్ బ్యాటర్లు బాగానే దృష్టి పెట్టిన కూడా కీలక ప్లేయర్ హ్యారీ బ్రూక్‌ను ఔట్ చేశాడని కుంబ్లే వెల్లడించాడు.
Read Also: Asia Cup 2025: ఆసియా కప్ నిర్వహణపై అనిశ్చితి… ఢాకా మీటింగ్‌కు భారత్, శ్రీలంక దూరం!
ఇక, నితీశ్ కుమార్ రెడ్డి తొలిరోజు 14 ఓవర్ల పాటు బౌలింగ్ వేశాడు.. ఇంకా కొన్ని ఓవర్లు వేసేంత ఫిట్నెస్ అతడికి ఉందన్నారు భారత దిగ్గజ క్రికెటర్ అనిల్ కుంబ్లే. కుర్రాడు కావడంతో కంట్రోల్ గా బౌలింగ్ చేశాడు. ఆసీస్ పర్యటనలో శతకం చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఆ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసుకోకపోయినప్పటికీ మంచి భాగస్వామ్యాలను విడదీసేలా బౌలింగ్ చేయగల సమర్థుడని మరోసారి ఇప్పుడూ నిరూపించుకున్నాడని కొనియాడారు. అలాగే, ఫీల్డింగ్‌లోనూ కూడా చురుగ్గా కదలడం నితీశ్‌కు కలిసొచ్చే అంశం అని పేర్కొన్నాడు. అందుకే, నితీశ్ కుమార్ విషయంలో మాత్రం వేటు వేయడం, పక్కన పెట్టడం లాంటివి చేయొద్దు.. కొన్ని సార్లు ఫెయిల్ అయినప్పటికీ అవకాశాలు ఇస్తూ ఆడించాలని కుంబ్లే కోరారు.