ఐపీఎల్ సీజన్ 2022 రసవత్తరంగా సాగుతోంది. ఊహించని విధంగా జట్ల మధ్య పోటీ జరుగుతోంది. ఐపీఎల్ సీజన్లలోనే ఈ సీజన్ ప్రత్యేకంగా నిలుస్తుందని కొందరు క్రికెట్ అభిమానులు అంటున్నారు. అయితే నేడు ముంబాయి వాంఖడే స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ బౌలింగ్‌ను ఎంచుకుంది.
అయితే.. ఇప్పటికే ఓసారి ఈ సీజన్‌లోనే ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడ్డాయి. ఇది రెండో మ్యాచ్ కావడ విశేషం. అయితే గత మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రాణించి కేకేఆర్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభవానికి నేడు కేకేఆర్ జట్టు ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది.