Delhi Capitals Scored 65 In First 10 Overs: చెన్నై సూపర్ కింగ్స్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నత్తనడక ఇన్నింగ్స్ కొనసాగిస్తోంది. మొదట్లోనే మూడు కీలక వికెట్లు కోల్పోవడంతో.. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు ఆచితూచి ఆడుతున్నారు. తొలి 10 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ జట్టు మూడు వికెట్ల నష్టానికి కేవలం 65 పరుగులే చేసింది. లక్ష్యాన్ని ఛేధించాలంటే.. మరో 10 ఓవర్లలో 103 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఢిల్లీ జట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే.. అంత లక్ష్యాన్ని చేధించడమనేది కత్తి మీద సాము లాంటిదే. ఎందుకంటే.. చెన్నై బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ వేస్తున్నారు. దీనికితోడు.. భారీ ఇన్నింగ్స్ ఆడే ఆటగాళ్లు కూడా ఢిల్లీలో ఇప్పుడు లేరు. ప్రస్తుతం క్రీజులో ఉన్న మనీష్ పాండే, రుస్సోనే.. భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. మరి.. అది సాధ్యం అవుతుందా? ఢిల్లీ అంత లక్ష్యాన్ని ఛేధించగలుగుతుందా?
Malaika Arora: ఆ ఎద అందాల ఆరబోత.. దేవుడా తట్టుకోవడం కష్టమే

బ్యాటింగ్‌కి దిగిన ఆదిలోనే ఢిల్లీ జట్టుకి ఊహించని ఝలక్ తగిలింది. రెండో బంతికే డేవిడ్ వార్నర్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత విధ్వంసకర ఆటగాడు ఫిల్ సాల్ట్ కొన్ని మెరుపులు మెరిపించి.. ఆ జోష్‌లోనే అనవసరమైన షాట్ కొట్టి, క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం.. మిచెల్ మార్ష్ కూడా రనౌట్‌గా వెనుదిరిగాడు. అప్పుడు క్రీజులోకి వచ్చి మనీష్ పాండే, రుస్సో.. నిదానంగా ఆడుతూ, తమ జట్టుని ముందుకు తీసుకెళ్తున్నారు. లక్ష్యం దిశగా తమ జట్టుని పరుగులు పెట్టించేందుకు తమవంతు పోరాటం కొనసాగిస్తున్నారు. అయితే.. 10 ఓవర్లలో 103 కొట్టాలంటే.. ఓవరి 10 చొప్పున రన్ రేట్‌తో పరుగులు చేయాలి. ఈ లెక్కన.. ఢిల్లీ జట్టు బౌండరీల మోత మోగించాల్సి వస్తుంది. చూద్దాం.. చివరికి ఫలితం ఎలా వస్తుందో?
Faria Abdullah: ఓ.. చిట్టి.. నీలో ఇంత ఫైర్ ఉందని అనుకోలేదే..