Deepak Chahar: దీపక్ చాహర్ రిసెప్షన్లో పాక్ క్రికెటర్.. ఎవడు పిలిచాడంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ పేసర్ దీపక్ చాహర్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి జయా భరద్వాజ్‌ను జూన్ 1న ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో దీపక్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా జయ భరద్వాజ్‌కు చాహర్ ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా సంతోషంగా అంగీకరించడంతో.. ఏడాది పాటు ఈ జంట ప్రేమ మత్తులో మునిగి తేలింది. గాయంతో దీపక్ చాహర్ క్రికెట్ కెరీర్‌కు బ్రేక్ రావడంతో వివాహం చేసుకున్నారు.
ఆగ్రాలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న దీపక్ చాహర్.. సహచర ఆటగాళ్ల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. ఈ పెళ్లి రిసెప్షన్‌కు భారత యువ ఆటగాళ్లు చాలా మంది హాజరయ్యారు. వారిలో రిషభ్ పంత్, కర్ణ్ శర్మ, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్ తదితరులంతా వచ్చి చాహర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌కు సంప్రదాయ పఠానీ కుర్తాలో వచ్చిన వ్యక్తిని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
Also Read
- India T20 Captain: బీసీసీఐ కీలక నిర్ణయం.. సూర్యకుమార్ ఔట్.. టీమిండియా కొత్త కెప్టెన్ ఎవరంటే?
- Pat Cummins: బిగ్ షాక్.. వచ్చే ఐపీఎల్ నుంచి ప్యాట్ కమిన్స్ దూరం..? రూ.113 కోట్లతో భారీ డీల్..
- TG20 Cricket: తెలంగాణ క్రికెట్ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
- Abhishek Sharma: రికార్డుల వేటలో అభిషేక్ శర్మ.. ఆ క్లబ్‌లోకి కూడా చేరిన అభిషేక్.
పాకిస్థాన్ ప్లేయర్ హసన్ అలీలా ఉండటంతో అతన్ని కూడా రిసెప్షన్‌కు పిలిచారా? అని ప్రశ్నించడం మొదలు పెట్టారు. భారత ఆటగాళ్లకు సంబంధించి ఫొటో నెట్టింట వైరల్ కాగా.. హసన్ అలీని పోలి ఉన్న వ్యక్తి విషయంలో గందరగోళానికి గురయ్యారు. అసలు అతన్ని ఎవరు పిలిచారంటూ ప్రశ్నించడం మొదలుపెట్టారు.
అయితే ఆ ఫొటోను నిశితంగా పరిశీలిస్తే అతను హసన్ అలీ కాదని తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున IPL లో అద్భుతంగా రాణించిన భారత్ పేసర్ ఖలీల్ అహ్మద్ అని స్పష్టమైంది. అతని వేషధారణ వల్లే ఈ కన్ఫ్యూజన్ వచ్చిందని మరికొందరు నెటిజన్లు వివరించారు.
IPL 2022 సీజన్‌కు ముందు వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో దీపక్ చాహర్ గాయపడ్డాడు. దాంతో ఎన్సీఏలో చేరిన అతను గాయం నుంచి కోలుకుంటున్న దశలో మరో గాయానికి గురయ్యాడు. వెన్ను నొప్పి గాయానికి గురవ్వడంతో ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. అతని గైర్హాజరీ ఆ జట్టుకు తీవ్ర నష్టం చేసింది.
- Tags
- bcci
- Deepak Chahar
- ipl
- Rishabh Pant
తాజావార్తలు
-
Lavanya Tripathi: చిరంజీవిపై లావణ్య త్రిపాఠి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
OnePlus Nord CE 6 Lite: వన్‌ప్లస్ నార్డ్ CE6 లైట్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, ధర సేల్ డేట్ పూర్తి సమాచారం
-
PEDDI : కేవలం 4 గంటల్లో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసిన పెద్ది
-
IPL 2026 Final: చిన్నస్వామి నుంచి ఐపీఎల్ ఫైనల్ తరలింపు.. షాకింగ్ విషయం చెప్పిన బీసీసీఐ!
-
New Bat Coronavirus: థాయ్‌లాండ్‌లో కొత్త కరోనావైరస్.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?