David Warner: వార్నర్ సంచలన ప్రకటన.. 2024లో గుడ్‌బై
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner To Retire From Cricket After 2024 T20 World Cup: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ తాజాగా సంచలన ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది సమ్మర్ సీజన్లో తాను టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోబోతున్నానని పేర్కొన్నాడు. జనవరి సిడ్నీ వేదికగా పాకిస్తాన్‌తో జరగబోయే టెస్టు సిరీసే తనది ఆఖరిదని అతడు కుండబద్దలు కొట్టాడు. అంతేకాదు.. 2024 టీ20 వరల్డ్‌కప్ తనకు ఆస్ట్రేలియా తరఫున చివరి టోర్నీ అవుతుందని బాంబ్ పేల్చాడు. ‘‘నేను ఇంతకుముందు చెప్పినట్టుగా.. 2024 టీ20 వరల్డ్ కప్ నా ఫైనల్ గేమ్ అవుతుంది. ఈ విషయంపై నేను ఇప్పటికే నా కుటుంబ సభ్యులతో మాట్లాడాను. నేను నా టెస్టు కెరీర్‌ని హోమ్‌గ్రౌండ్‌లో (సిడ్నీ) పాకిస్తాన్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌తో ముగించాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ నేను డబ్ల్యూటీసీ, యాషెస్ సిరీస్‌లో బాగా రాణించగలిగితే.. పాకిస్తాన్ సిరీస్‌తో టెస్టు కెరీర్‌కి గుడ్‌బై చెప్తా. ఒకవేళ ఆ రెండు సిరీస్‌లలో బాగా రాణించకపోతే.. పాకిస్తాన్ సిరీస్దాకా ఉంటానో లేదో చెప్పలేను. కానీ.. వెస్టిండీస్ సిరీస్ అయితే నేను కచ్ఛితంగా ఆడను’’ అంటూ వార్నర్ చెప్పుకొచ్చాడు.
WTC Final: WTC ఫైనల్లో భారత్ గెలిస్తే.. ఆ ఘనత సాధించిన తొలిజట్టుగా సరికొత్త చరిత్ర
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్‌కు కొత్త మలుపు
కాగా.. 2011లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌తో డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసిన వార్నర్.. రెండో టెస్టులో మాత్రం సెంచరీ చేసి, తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. అప్పటి నుంచి అతని కెరీర్ దిగ్విజంగా సాగింది. తన కెరీర్లో 102 టెస్టులు ఆడిన వార్నర్.. 45.58 సగటుతో 8158 పరుగులు చేశాడు. అందులో ఒక ట్రిపుల్ సెంచరీ, మూడు డబుల్ సెంచరీలతో పాటు 25 సెంచరీలు బాదాడు. బౌలింగ్‌లోనూ అతగాడు 4 వికెట్లు తీశాడు. అతని కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో.. 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదంలో అతడు చిక్కుకున్నాడు. ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు. ఇదే వ్యవహారంలో స్టీవ్ స్మిత్ కూడా ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు కానీ, వార్నర్‌పై మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా జీవితంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా జీవితకాల నిషేధం విధించింది. దీనిపై అతడు పిటిషన్ దాఖలు చేశాడు కానీ, క్రికెట్ ఆస్ట్రేలియా సరిగ్గా స్పందించకపోవడంతో దాన్ని విరమించుకున్నాడు.
Odisha Train Accident: 3 రైళ్లు ఒకదానికొకటి ఎలా ఢీకొన్నాయో తెలుసా..?
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!