అంతర్జాతీయ క్రికెట్ కు సౌతాఫ్రికా పేసర్ డెయిల్ స్టెయిన్ గుడ్ బై చెప్పారు. అన్ని రకాల ఫార్మెట్లకు రిటైర్డ్ మెంట్ ప్రకటించారు డెయిల్ స్టెయిన్. ఈ విషయాన్ని కాసేపటి క్రితమే తన ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు డెయిల్ స్టెయిన్. 20 ఏళ్ల కెరీర్ కు నేటి తో ముంగింపు అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు డెయిల్ స్టెయిన్. 38 ఏళ్ల స్టెయిన్ తన కెరీర్ లో 93 టెస్ట్‌లు, 125 వన్డేలు, 47 టీ 20 లు ఆడాడు డేల్ స్టెయిన్. అటు ఐపీఎల్ లోనూ డేల్ స్టెయిన్ ఆడి… మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. గతంలో వరల్డ్ నెంబర్ వన్ పేసర్ గా స్టెయిన్ రికార్డు నెలకోల్పిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉండగా.. పేసర్ డెయిల్ స్టెయిన్ రిటైర్మెంట్ పై సౌతాఫ్రికా జట్టు విచారం వ్యక్తం చేస్తోంది.