ఐపీఎల్ 2022 సీజన్‌లో జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. నేడు ముంబాయిలోని డీవై పాటేల్ స్టేడియం వేదికగా చైన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడుతోంది. అయితే టాస్ గెలిచి సీఎస్‌కే బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో ఈ రెండు జట్ల ప్రదర్శన ఆశించిన మేరకు లేనప్పటికీ, ఈ మ్యాచ్‌పై మాత్రం ఊహకందని హైప్ నెలకొంది. అయితే బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆదిలోనే రోహిత్ శర్మ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. రెండు పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఆదుకుంటారనుకున్న డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా చేతులెత్తేయడంతో ముంబై మరిన్ని కష్టాల్లో పడింది. ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.