Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
- క్రికెట్లో తొలి హెల్మెట్ ధరించిన ఆటగాడు డెన్నిస్ అమిస్.
- బైక్ హెల్మెట్ చూసి వచ్చిన ఆలోచనే క్రికెట్ హెల్మెట్‌కు కారణం.
- వేగవంతమైన బౌలర్ల నుంచి రక్షణ కోసం రూపొందించిన భద్రతా పరికరం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cricket Helmet History: ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో ఏ బ్యాటర్ అయినా ‘‘హెల్మెట్’’ లేకుండా బ్యాటింగ్ చేయడం దాదాపుగా అసాధ్యం. కానీ, ఒకప్పుడు బ్యాటర్లు ఎలాంటి హెల్మెట్ లేకుండా జెంటిల్మెన్ గేమ్ ఆడేవారు. గంటకు 140 కిలోమీటర్ల వేగంగా వచ్చే బంతుల్ని ఎదుర్కొనేవారు. ఒక వేళ ఇవి తలకు తాకితే ప్లేయర్ చనిపోవడం గ్యారెంటీ. అలాంటి సమయంలోనే క్రికెట్లోకి హెల్మెట్ వచ్చింది. ఇంగ్లాండ్ దిగ్గజ క్రికెటర్ ఆలోచన నుంచి పుట్టిందే ఈ హెల్మెట్.
ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ డెన్నిస్ అమిస్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా హెల్మెట్ ధరించి బ్యాటింగ్ చేసిన ఆటగాడిగా గుర్తింపు పొందారు. తన కాలంలో ఇతను అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా పేరొందారు. బ్యాటింగ్ చేస్తు్న సమయంలో బౌలర్లు విసిరే బాల్స్ తన తలకు తగిలితే పరిస్థితి ఏంటనే ఆలోచన అమిస్లో ఉండేది. ప్యాకర్ వరల్డ్ సిరీస్‌లో సమయంలో 90 మైళ్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లను ఎదుర్కోవడం కష్టంగా ఉండేదని ఆయన చెప్పారు. ఇలాంటి సమయంతో తన సహచర ఆటగాడు టోనీ గ్రేగ్తో మాట్లాడుతుండగా ఒక వ్యక్తి హెల్మెంట్ ధరించి బైక్‌పై వెళ్తుండటం గమనించారు. దీని ద్వారానే ‘‘క్రికెట్ హెల్మెంట్’’ పుట్టింది.
Also Read
- Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
- Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసకర ఇన్నింగ్స్.. బోర్డుపై భారత్ స్కోర్ 900 పరుగులు..
- Virat Kohli: వన్డే జట్టులో కోహ్లీ రికార్డుల వేట.. ఇంగ్లాడ్ పై ఆ ఘనత సాధిస్తాడా..?
- Vaibhav Sooryavanshi: ఫైనల్ ముందే శ్రీలంకకు వైభవ్ బిగ్ వార్నింగ్.. సూర్యవంశీ ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశారా?
బైక్ రైడర్ల భద్రత కోసం హెల్మెట్లు వాడితే, బ్యాటర్లు ప్రమాదాలు ఎదుర్కోవడానికి హెల్మెట్లు అవసరమని అమిస్ బలంగా వాదించారు. దీంతోనే హెల్మెట్ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీంతో ప్రత్యేకంగా ఆట కోసం హెల్మెట్లను రూపొందించడం ప్రారంభమైంది. క్రమంగా ప్రపంచవ్యాప్తంగా క్రికెటర్లు హెల్మెట్లను వాడటం ప్రారంభమైంది.
డెన్నిస్ అమిస్ అద్భుతమైన అంతర్జాతీయ కెరీర్ కలిగి ఉన్నారు. ఇంగ్లాండ్ తరపున 50 టెస్టులు మరియు 18 వన్డేలు (ODIs) ఆడారు. టెస్ట్ క్రికెట్లో 11 సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో సహా మొత్తం 3612 పరుగులు చేశారు. టెస్టుల్లో ఆయన అత్యధిక స్కోరు 263 నాటౌట్. వన్డే క్రికెట్లో ఆయన 859 పరుగులు మరియు నాలుగు సెంచరీలు సాధించారు.
తాజావార్తలు
-
Cricket Helmet History: క్రికెట్ హెల్మెట్ వెనుక ఆసక్తికర కథ.. ఎలా పుట్టిందో తెలుసా..
-
Ammonia Gas Leak : తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి.!
-
Botsa Satyanarayana : పవన్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్.. రాజ్యాంగ పదవికి అర్హుడా.?
-
Anil Ravipudi: రక్త తిలకం దిద్దిన వెంకటేష్.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ‘అనిల్ మార్క్’ నవ్వుల వర్షం!
-
Harmanpreet Kaur: ప్రపంచ క్రికెట్ చరిత్రలో తొలి ప్లేయర్‌గా రికార్డు.. హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఘటన..
ట్రెండింగ్
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!