NTV Telugu Site icon

IND vs BAN: నేడే బంగ్లాతో టీమిండియా తొలి సమరం..

Ban1

Ban1

IND vs BAN: ఛాంపియన్స్ ట్రోఫీలో తమ మొదటి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో భారత్ దుబాయ్ వేదికగా తలపడబోతుంది. ఇక, తమ తొలి మ్యాచ్‌లో ఈ రోజు (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడుతుంది. ఇరు జట్ల బలాబలాలు, ఫామ్‌ పరంగా చూసుకుంటే రోహిత్‌ సేన బంగ్లా కంటే ఎంతో బలంగా కనిపిస్తుంది. అయితే, ఎప్పటిలాగే బంగ్లాదేశ్‌ తమ స్థాయికి మించిన ప్రదర్శన కనబర్చి సంచలనాన్ని సృష్టిస్తుంది. బ్యాటింగ్‌తో పాటు స్పిన్‌ ప్రధాన బలంగా భారత్‌ రంగంలోకి దిగుతుండగా… బంగ్లాదేశ్‌ తమ పేస్‌ బౌలింగ్‌పై గంపెడు ఆశలు పెట్టుకుంది.

Read Also: YS Jagan: వైఎస్‌ జగన్‌ గుంటూరు మిర్చియార్డ్‌ పర్యటన.. కేసు నమోదు..

ఇక, భారత్‌ తుది జట్టు కూర్పులో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతుందని సమాచారం. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, గిల్‌ శుభారంభం అందిస్తే ఆ తర్వాత కోహ్లి దానిని కొనసాగిస్తాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన లాస్ట్ వన్డేలో హాఫ్ సెంచరీ కొట్టిన కోహ్లి భారీ ఇన్నింగ్స్‌ ఆడాలని ఎదురు చూస్తున్నాడు. ఫాంలో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌తో పాటు ఐదో స్థానంలో కేఎల్‌ రాహుల్‌ కూడా ఆడితే టీమిండియాకు తిరుగుండదు. గత సిరీస్‌లో వరుస ప్రయోగాలతో కేఎల్ రాహుల్‌ స్థానం పలుమార్లు మార్చారు. కానీ, ఈ సారి మాత్రం అతనికి ఐదో స్థానంలోనే ఆడించే ఛాన్స్ ఉంది. హర్థిక్ పాండ్యా, జడ్డూ, అక్షర్‌ల ఆల్‌రౌండ్‌ నైపుణ్యం టీమ్ కు అదనపు బలగా చెప్పొచ్చు. మరోవైపు, బౌలింగ్ లో కుల్దీప్‌ చాలా రోజులుగా మంచి ఆటతీరు కనబరుస్తుంగా.. ఫేస్ విభాగంలో షమీ, అర్ష్ దీప్‌ ఉన్నారు.

Read Also: Bandi Sanjay: కాంగ్రెస్ నాయకులలో హిందూ రక్తం లేదా?.. ఈ అంశాలను ఎందుకు ప్రశ్నించరు?

అయితే, షకీబ్‌ల్ హసన్ లేకుండా 2004 తర్వాత బంగ్లాదేశ్‌ తొలిసారి ఒక పెద్ద టోర్నీ ఆడబోతుంది. లిటన్‌ దాస్‌ కూడా ఈ మెగా సమరంలో లేడు. కాగా, ఇతర సీనియర్లు ముష్పికర్, మహ్ముదుల్లా లాంటి ప్లేయర్లు మరోసారి టీమ్ భారం మోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. యువ బ్యాటర్లలో తన్‌జీద్, తౌహీద్‌ ఇటీవల పెద్దగా ఎఫెక్ట్ చూపించడం లేదు. అలాగే, కెప్టెన్ నజ్ముల్ చాలా కాలంగా ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి పరిస్థితిలో ఈ బ్యాటింగ్‌ లైనప్‌ టీమిండియా బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోగలదనేది అనుమానంగానే మారింది. పేసర్లు ముస్తఫిజుర్, నాహిద్‌ రాణా, తస్కీన్‌లపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. స్పిన్‌ ఆల్‌రౌండర్‌ మెహదీ మిరాజ్‌ కీలకంగా వ్యవహరిస్తే బంగ్లాకు తిరుగే లేదు.

తుది జట్లు:
టీమిండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యార్, కేఎల్ రాహుల్ (వికట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్ దీప్‌ సింగ్.

బంగ్లాదేశ్‌: నజ్ముల్ (కెప్టెన్‌), తన్‌జీద్, సౌమ్య సర్కార్, తౌహీద్, ముష్పికర్, మహ్ముదుల్లా, మెహదీ హసన్‌ మిరాజ్, రిషాద్, తస్కీన్, నాహిద్, ముస్తఫిజుర్‌.