Bombay High Court Issues Notice To Prithvi Shaw In Sapna Gill Case: టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లేయెన్సర్ సప్నా గిల్ మధ్య కొంతకాలం క్రితం ‘సెల్ఫీ’ విషయమై వివాదం చెలరేగిన విషయం తెలిసిందే! ఈ వ్యవహారం అప్పట్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా కూడా నిలిచింది. ఇప్పుడు ఇదే గొడవ పృథ్వీ షాను మరింత ఇరకాటంలో నెట్టేసింది. జూన్‌లో విచారణకు హాజరు కావాల్సిందిగా బాంబే హైకోర్టు గురువారం నోటీసులు జారీ చేసింది. అతనితో పాటు పోలీసుల్ని సైతం విచారణకు రావాలని ఆదేశించింది.
Current Shock: ఇంట్లో శుభకార్యం.. అకస్మాత్తుగా కరెంట్ షాక్..
కాగా.. ఫిబ్రవరిలో ముంబైలోని ఒక స్టార్ హీటల్‌లో పృథ్వీ షా, సప్నా గిల్‌కు గొడవ జరిగింది. ఈ గొడవలో భాగంగా పృథ్వీ స్నేహితుడి కారుపై సప్నా గిల్ దాడి చేయడం, ఆమెను ఆపేందుకు పృథ్వీ ప్రయత్నించడం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే పోలీసులు సప్నా గిల్‌ను అరెస్ట్ చేశారు. అయితే.. సప్నా గిల్ వాదన మాత్రం మరోలా ఉంది. తనతో ఉన్న వ్యక్తి సెల్ఫీ ఇవ్వమని అడిగినందుకు.. పృథ్వీ షా దురుసుగా మాట్లాడటంతో పాటు తనను అసభ్యంగా తాకాడని ఆరోపించింది. అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అయితే.. పోలీసులు ఆమె ఫిర్యాదుని స్వీకరించకపోవడంతో.. ఏప్రిల్ మొదటి వారంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. పృథ్వీ షాతో పాటు ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిసున్న పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరింది.
Prema: సౌందర్య తల లేదు.. మొండెం మాత్రమే ఉంది.. వాచ్ చూసి
ఈ నేపథ్యంలో సప్నా గిల్ తరఫు న్యాయవాది అలీ కశిఫ్ ఖాన్ తన వాదనలు వినిపిస్తూ.. పృథ్వీ షాతో పోలీసులు చేతులు కలిపారని, తన క్లైంట్‌పై తప్పుడు కేసు బనాయించి అరెస్టు చేయించారని కోర్టుకు తెలిపారు. ఆ గొడవకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని గమనిస్తే.. అసలు విషయమేంటో అర్థం అవుతుందని అన్నారు. తన క్లైంట్ అభ్యర్థన మేరకు.. పృథ్వీ షా, అతడికి సహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలు విన్న అనంతరం బాంబే హైకోర్టు పృథ్వీ షాతో పాటు పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ.. జూన్‌లో విచారణకు హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్‌బీ షుక్రే, ఎంఎం సతాయేలతో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది.