Site icon NTV Telugu

India vs New Zealand: న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు.. భారీ స్కోర్ సాధించిన ఇండియా

India Vs Newzealand

India Vs Newzealand

Big score for India against New Zealand: ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కులు చూపించారు భారత బ్యాటర్లు. ఓపెనర్లు శిఖర్ ధావన్, శుభ్‌మాన్ గిల్ అద్భుత అర్థ సెంచరీలతో భారీ స్కోరుకు బాటలు వేశారు. ఈ ఇద్దరి జోడీ న్యూజిలాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. శిఖర్ ధావన్ 72(77), శుభ్‌మాన్ గిల్ 50(65) పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్ 80(76) పరుగులు చేయడంతో ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 306/7 పరుగుల భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ ముందు 307 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Read Also: China: టీవీ ఎక్కువగా చూస్తున్నాడని.. రాత్రంతా టీవీ చూపించిన పేరెంట్స్..

రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ నిరాశ పరిచారు. చివర్లో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కేవలం 16 బంతుల్లో 37 పరుగులు చేశాడు. దీంతో ఇండియా భారీ స్కోర్ సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో టిమ్ సౌథీ, ల్యూక్ పెర్గుసన్ తలో 3 వికెట్లు తీశారు. ఆడమ్ మిల్నే ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరుపున ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్ వన్డే అరంగ్రేటం చేశారు. ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకుని భారత్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించారు. అయితే పిచ్ పై పచ్చిక ఉండి బౌన్స్ కు సహకరిస్తుందని న్యూజిలాండ్ భావించినా.. న్యూజిలాండ్ పేసర్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఓపెనింగ్ జోడి శిఖర్ ధావన్, శుభ్ మాన్ గిల్ కివీస్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నారు.

Exit mobile version