Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
- నైట్‌క్లబ్‌లో వివాదాస్పద ఘటన
- బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి
- అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్ విజయం అనంతరం సహచర ఆటగాడు గస్ అట్కిన్సన్‌తో కలిసి నైట్‌క్లబ్‌లో జరిగిన వివాదాస్పద ఘటనలో స్టోక్స్ పేరు మార్మోగిపోయింది. దాంతో అతడి కెప్టెన్సీపై వేటు పడే అవకాశాలు ఉన్నాయని బ్రిటిష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కెప్టెన్సీ నుంచి తప్పిస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌కే వీడ్కోలు పలికే అవకాశాన్ని కూడా స్టోక్స్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
తాజా నివేదికల ప్రకారం.. బెన్ స్టోక్స్‌కు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రెండు ఆప్షన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి స్వచ్ఛందంగా కెప్టెన్సీకి రాజీనామా చేసి టెస్ట్ క్రికెట్‌ను కొనసాగించడం. జట్టు నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈసీబీ స్వయంగా అతడిని కెప్టెన్సీ నుంచి తొలగింగించడం రెండోది. ఈ నేపథ్యంలో స్టోక్స్ పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈసీబీ తీసుకునే నిర్ణయం స్టోక్స్ కెరీర్‌కు కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
- BAN vs AUS: ఆసీస్‌పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- India A vs Sri Lanka A: ఇండియా ‘ఎ’ సంచలన బోణీ.. లంకపై భారత్ థ్రిల్లింగ్ విక్టరీ!
- Mohammed Siraj: భారత జట్టులో కీలక మార్పు.. సిరాజ్ ఔట్.. అసలు విషయం ఇదే..!
న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ ముగిసిన తర్వాత సోమవారం తెల్లవారుజామున బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ లండన్‌లోని ఓ నైట్‌క్లబ్‌కు వెళ్లారు. ఇద్దరూ ప్లేయర్స్ మద్యం మత్తులో ఓ రగ్బీ ఆటగాడితో గొడవకు దిగారు. స్టోక్స్, అట్కిన్సన్‌లకు ఏమీ గాయాలు లేకపోయినా.. అక్కడే ఉన్న ఈసీబీ భద్రత సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. జట్టు విధించిన అర్ధరాత్రి కర్ఫ్యూ నిబంధనలను ఇద్దరూ ఉల్లంఘించినట్లు ఈసీబీ గుర్తించింది. దీంతో బోర్డు అధికారిక విచారణ ప్రారంభించింది. ఈ ఘటనపై ఈసీబీ ఇప్పటికే స్పందించింది. ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించిన అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని, మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం అని పేర్కొంది. రెండో టెస్ట్ జట్టు ప్రకటనకు ముందు చర్యలు తీసుకుంటాం అని తెలిపింది.
తాజావార్తలు
-
Hyderabad Crime : మల్కాజ్‌గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
-
Pakistan Airstrikes Afghanistan: ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. 13 మంది మృతి
-
Money: జీతం పెరుగుతున్నా చేతిలో డబ్బు మిగలడం లేదా? మధ్యతరగతి ఎక్కువగా చేసే పొరపాటు ఇదే!
-
NBK 111 : బాలయ్య న్యూ ఏజ్ విధ్వంసానికి ముహూర్తం ఫిక్స్.. గెట్ రెడీ
-
Ben Stokes Retirement: బెన్ స్టోక్స్ సంచలన నిర్ణయం.. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై?
ట్రెండింగ్
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?