Site icon NTV Telugu

Asia Cup 2025: దుబాయ్ వేదికగా ఆసియా కప్.. ఒకే గ్రూపులో భారత్-పాకిస్తాన్..

Asia Cup 2025

Asia Cup 2025

Asia Cup 2025: ఆసియా కప్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. మరోసారి క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచబోతోంది. దాయాదులు మరోసారి కలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ T20 టోర్నమెంట్‌కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది. గురువారం ఢాకాలో జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) వార్షిక సర్వసభ్య సమావేశంలో (AGM) ఆసియా కప్ గురించి చర్చించారు. దీనికి భారత క్రికెట్ బోర్డు అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు.

Read Also: Cyber Fraud: కామపల్లి సైబర్ మోసగాడు పోలీసుల వలలో – 4 లక్షల రూపాయల దోపిడీ

బీసీసీఐ ఈ టోర్నీని తటస్థ వేదికలపై నిర్వహించేందుకు ఓకే చెప్పింది. దుబాయ్, అబుదాబీ వంటి ప్రదేశాల్లో టోర్నీని నిర్వహించడానికి సుముఖత వ్యక్తం చేసింది. మూడు వేదికలను ఉపయోగించుకునేందుకు క్రికెట్ బోర్డు (ECB)తో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, ఆసియా కప్‌ కోసం రెండింటిని మాత్రమే ఉపయోగిస్తారని అంతా భావిస్తున్నారు. 8 జట్లు పాల్గొనే ఆసియా కప్‌ను భారత్ నిర్వహించాల్సి ఉంది. అయితే, పమల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ఆసియా కప్ లో పాల్గొనదు, ఆతిథ్యం ఇవ్వదు అనే వార్తలు వెలువడ్డాయి. పాకిస్తాన్ జట్టు భారత్‌లో ఆడడానికి నో చెప్పవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి.

బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్-పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీలు రాబోయే రోజుల్లో వేదికలు, టోర్నమెంట్ షెడ్యూల్ ఖరారు చేసేందుకు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7 నుంచి మూడు, నాలుగో వారంలో టోర్నమెంట్ షెడ్యూల్ ఉండనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగబోయే T20 ప్రపంచ కప్‌కు సన్నాహక కార్యక్రమంగా భావిస్తున్నారు.

Exit mobile version