Asia Cup 2025: ఆసియా కప్ 2025పై బిగ్ అప్డేట్ వచ్చింది. మరోసారి క్రికెట్ అభిమానులకు ఆనందాన్ని పంచబోతోంది. దాయాదులు మరోసారి కలబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే గ్రూపులో భారత్, పాకిస్తాన్ ఉండే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత ఈ టోర్నీ నిర్వహణపై అనిశ్చితి ఏర్పడింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఈ T20 టోర్నమెంట్‌కు ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలుస్తోంది.