BCCI Partners: బీసీసీఐతో చాట్‌జీపీటీ, క్యాంపా, ఎస్బీఐ లైఫ్ ఒప్పందం.. రూ.130 కోట్లకు పైగా డీల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI Partner with ChatGPT: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. టీమిండియా స్వదేశీ క్రికెట్ సీజన్‌కు క్యాంపా, ఎస్బీఐ లైఫ్, చాట్‌జీపీటీ సంస్థలను అసోసియేట్ పార్ట్నర్లుగా ప్రకటించింది. రెండు సీజన్ల పాటు ఈ భాగస్వామ్యం కొనసాగనుంది. భారత్-వెస్టిండీస్ సిరీస్‌తో ప్రారంభమై.. 2028 మార్చి వరకు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఈ మూడు భాగస్వామ్యాల ద్వారా బీసీసీఐకి రూ.130 కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. గత సైకిల్‌తో పోలిస్తే ఈసారి డీల్ విలువ 44 శాతం పెరిగినట్లు బీసీసీఐ వెల్లడించింది. దీంతో భారత క్రికెట్ బ్రాండ్ విలువ, మార్కెట్లో ఉన్న డిమాండ్ మరోసారి స్పష్టమైంది.
క్యాంపా, ఎస్బీఐ లైఫ్, చాట్‌జీపీటీ మూడు విభిన్న రంగాలకు చెందిన సంస్థలు. పానీయాలు, బీమా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ రంగాలకు చెందిన ఈ బ్రాండ్లతో భాగస్వామ్యం ద్వారా క్రికెట్ అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశాలు లభిస్తాయని బీసీసీఐ తెలిపింది. భారత క్రికెట్ విస్తృతమైన అభిమాన వర్గాన్ని వ్యాపార సంస్థలు తమ బ్రాండ్ ప్రచారానికి ఉపయోగించుకునే అవకాశం ఉందని పేర్కొంది. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్ ఈ భాగస్వామ్యాలపై సంతోషం వ్యక్తం చేశారు. భారత స్వదేశీ క్రికెట్ సీజన్ దేశంలో అత్యంత విలువైన, డిమాండ్ ఉన్న క్రీడా వేదికల్లో ఒకటిగా కొనసాగుతోందని అన్నారు. క్యాంపా, ఎస్బీఐ లైఫ్, చాట్‌జీపీటీ భాగస్వామ్యం భారత క్రికెట్ వ్యవస్థకు ఉన్న బలానికి నిదర్శనమని పేర్కొన్నారు.
Also Read
- Team India T20 Records: టీ20ల్లో భారత్‌కు ఈ రికార్డులు ఏంది భయ్యా..? వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు పూనకాలే..
- WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
- Virat Kohli - Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
గత సైకిల్‌తో పోలిస్తే భాగస్వామ్యాల విలువ 44 శాతం పెరగడం ముఖ్యమైన పరిణామమని మిథున్ మన్హాస్ అన్నారు. భారత క్రికెట్‌తో అనుబంధం ద్వారా లభించే భారీ రీచ్, అభిమానుల ఆదరణ, వాణిజ్య అవకాశాలపై ప్రముఖ బ్రాండ్లు ఉంచుతున్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. మూడు సంస్థలు విభిన్నమైన బ్రాండ్ లక్ష్యాలతో రావడం ఆసక్తికరంగా ఉందని, వాటితో కలిసి బలమైన భాగస్వామ్యాలను నిర్మించేందుకు ఎదురుచూస్తున్నామని చెప్పారు. బీసీసీఐ గౌరవ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ ఒప్పందాలపై స్పందించారు. స్వదేశీ సీజన్ భాగస్వామ్యాల విలువ గణనీయంగా పెరగడం.. బీసీసీఐ, టీమిండియాపై బ్రాండ్లకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందన్నారు. రూ.130 కోట్లకు పైగా విలువైన తాజా ఒప్పందాలతో 44 శాతం వృద్ధి సాధించడం భారత క్రికెట్‌కు ఉన్న డిమాండ్‌కు నిదర్శనమని పేర్కొన్నారు.
- Tags
- bcci
- Campa
- ChatGcPT
- SBI Life
- Team India
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!