Here is Reason Why Virender Sehwag Won’t Apply For India Chief Selector Post: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ నాలుగు నెలల కింద రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యల చేయడంతో చీఫ్ సెలక్టర్ పదవి నుంచి బీసీసీఐ అతడిని తప్పించింది. భారత ప్లేయర్స్ పూర్తిస్థాయి ఫిట్‌నెస్ లేనప్పటికీ ఇంజక్షన్స్ వేసుకుని బరిలోకి దిగుతారని ఓ జాతీయ మీడియా నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్‌లో తెలిపారు. అంతేకాదు సౌరవ్ గంగూలీ-విరాట్ కోహ్లీ వివాదం, జస్ప్రీత్ బుమ్రా గాయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సమయంలో బీసీసీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
చేతన్ శర్మ తప్పుకోవడంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ తాత్కాలిక చైర్మన్‌గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. శరత్, సుబ్రతో బెనర్జీ, సలీల్ అంకోలా డిప్యూటీలుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం చీఫ్ సెలక్టర్‌గా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. చీఫ్ సెలక్టర్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. అయితే వీరూ ఆ పదవిపై ఆసక్తి చూడడపం లేదట. అందుకు ప్రధాన కారణం శాలరీ. ఈ కారణం చేతనే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కూడా చీఫ్ సెలక్టర్ పదవిపై ఆసక్తిగా లేదట. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
Also Read: IND vs WI: శుభ్‌మన్ గిల్‌కు షాక్.. సీఎస్‌కే స్టార్ ఓపెనర్‌కు భారత జట్టులో చోటు!
టీమిండియా చీఫ్ సెలక్టర్ పదవి కాలం ఐదేళ్లు. ఈ పదవిలో ఉన్న వ్యక్తికి ఏడాదికి రూ. కోటి జీతం అందుతుంది. సెలక్షన్ కమిటీలోని మిగతా నలుగురు సభ్యులకు 90 లక్షలు ఉంటుందని సమాచారం. అయితే తమకున్ను క్రేజ్ దృష్ట్యా వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ వంటి స్టార్లు ఎండార్స్‌మెంట్లు, కామెంట్రీ రూపంలో ఇంతకంటే ఎక్కువే సంపాదించే అవకాశం ఉంది. అందులకే భారత జట్టులోని స్టార్లుగా వెలుగొందిన ప్లేయర్స్ ఈ పదవిపై ఆసక్తిగా లేరట.
‘సీఓఏ నియామక సమయంలో వీరేంద్ర సెహ్వాగ్‌ను హెడ్ కోచ్ పదవికి అప్లై చేయమనే ప్రతిపాదనలు వెళ్లాయి. కానీ వీరూ పట్టించుకోలేదు. అప్పుడు మాజీ దిగ్గజం అనిల్ కుంబ్లేకు అవకాశం వచ్చింది. పదవులు ఆర్థికంగానూ మనకు దోహదం చేస్తేనే.. ఎవరైనా ఇంట్రెస్ట్ చూపుతారు. ఆపై నార్త్ జోన్ నుంచి సెలక్టర్‌గా సెహ్వాగ్ వచ్చే ఛాన్స్ ఉన్నా.. అదీ జరుగలేదు. సెలక్టర్‌కు 4-5 కోట్ల రూపాయలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. జీతం తక్కువ అన్న కారణంగానే భారత జట్టు స్టార్ ఆటగాళ్లు సెలక్షన్ కమిటీలో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు’ అని ఓ బీసీసీఐ అధికారి చెప్పుకోచ్చారు.
Also Read: Today Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. మళ్లీ పడిపోయిన బంగారం ధర! లేటెస్ట్ రేట్లు ఇవే