BCCI Tax Details: క్రికెట్ అంటే ఇష్టం ఉండని వారు ఉండరు. చిన్న పిల్లాడు దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్దుడి వరకు క్రికెట్‌ను ఇష్టపడతారు. ఇక క్రికెట్‌కు సంబంధించిన టోర్నమెంట్లు ఉన్నాయంటే ఎన్నో రకాలుగా ఆదాయం ఉంటుంది. ఎన్నో వర్గాలకు ఆదాయం లభిస్తుంది. క్రికెట్ టోర్నమెంట్ ఉంటే టీవీల అమ్మకం జోరుగా సాగుతుంది. అటువంటి క్రికెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఫుట్‌బాల్ తరువాత ఎక్కువ మంది క్రేజీతో చూస్తే ఆట క్రికెట్. క్రికెట్‌కు అంత క్రేజ్ ఉంది. ఇక విషయానికి వస్తే క్రికెట్‌ను నిర్వహించడం కోసం ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ అధికారిక సంస్థ ఉంటుంది. అలాగే ఇండియాలో క్రికెట్ క్రీడా నియంత్రణకు భాతర్ క్రికెట్ నియంత్రన మండలి(బీసీసీఐ) ఉంది. బీసీసీఐ ప్రపంచంలోనే అన్ని క్రికెట్ బోర్డుల కంటే సంపన్న బోర్డుగా ఇప్పటి వరకు కొనసాగుతోంది. బీసీసీఐ వివిధ రూపాల్లో ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ఆదాయం వస్తే దానికి తగ్గట్టుగా ఆదాయ పన్ను చెల్లింపులు కూడా చేట్టాల్సి ఉంటుంది కదా. అలాగే బీసీసీఐ కూడా ప్రభుత్వానికి ఆదాయపు పన్ను చెల్లిస్తోంది.
Read also: Meher Ramesh: చిరంజీవితో రీమేక్ అంటే రిస్కని తెలిసి కూడా అందుకే చేశా!
బీసీసీఐ వివిధ రూపాల్లో ఏటా కొన్ని కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. వన్డే, టీ20, టెస్టు క్రికెట్ హక్కులను విక్రయించడం ద్వారా కోట్లలో ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా ఐపీఎల్‌కు సంబంధించిన హక్కుల విషయంలో అయితే చెప్పనవసరం లేదు. వివిధ టోర్నమెంట్స్ ఉన్న సమయంలో టీవీ, డిజిటల్ రైట్స్ రూపంలోనూ భారీగానే సంపాదిస్తోంది. ఇన్ని రకాలుగా ఆదాయం సంపాదిస్తున్న బీసీసీఐ ప్రభుత్వానికి ఆదాయపు పన్ను రూపంలో పన్ను చెల్లిస్తుంది. బీసీసీఐ ఏటా ఆదాయపు పన్ను రూపంలో ఎంతెంత చెల్లిస్తోందో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా వెల్లడించింది. ఒక పార్లమెంటు సభ్యుడు అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఐదేళ్లకు సంబంధించిన బీసీసీఐ ఆదాయం, ఖర్చులతో పాటు పన్నుల వివరాలను తన సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధురి వెల్లడించారు. 2021-22 సంవత్సరంలో రూ.1159 కోట్లను ఆదాయపు పన్ను రూపంలో ప్రభుత్వానికి బీసీసీఐ చెల్లించిందని మంత్రి తెలిపారు. ఇది 2020-21 ఆర్థిక సంవత్సరం కంటే 37 శాతం అధికమని పేర్కొన్నారు. 2020-21లో బీసీసీఐ రూ. 7,606 కోట్లు ఆదాయం సంపాదించగా.. రూ.3064 కోట్లు ఖర్చు చేసిందని మంత్రి తెలిపారు. అంతకుముందు ఆయా సంవత్సరాల్లో ఎంతెంత పన్ను చెల్లించిందో వెల్లడించారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.596.63 కోట్లు చెల్లించగా.. 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.815.08 కోట్లు పన్నుగా చెల్లించగా.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.882.29 కోట్లు చెల్లించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.844.92 కోట్లు చెల్లించగా.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.1,159 కోట్లను పన్ను రూపంలో చెల్లించినట్టు కేంద్ర మంత్రి సభకు తెలిపారు.