T20 World Cup: పాక్, బంగ్లా చెట్టాపట్టాల్.. ఐసీసీతో భేటీ ముందు కీలక సమావేశం..
- పాకిస్తాన్, బంగ్లాదేశ్ చెట్టాపట్టాల్..
- ఐసీసీ అత్యవసర మీటింగ్ ముందు రెండు దేశాల కీలక సమావేశం..
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్‌పై ఐసీసీ చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: T20 ప్రపంచ కప్ వివాదాలకు కేంద్రంగా మారింది. భారత్‌లో భద్రతా కారణాలు చూపుతూ, బంగ్లాదేశ్ ఆడటానికి నిరాకరించింది. తమ వేదికను శ్రీలంకకు మార్చాలని కోరింది. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించింది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది. అయితే, బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్ మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ), ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటించారు. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
ఇదిలా ఉంటే, క్రికెట్ చరిత్రలోనే అత్యంత విలువైన మ్యాచ్‌గా పేరున్న భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ రుద్దు అయితే, ఇది అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ), ఇతర దేశాల క్రికెట్ బోర్డు వార్షిక ఆదాయాలపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో శ్రీలంక వంటి కొన్ని బోర్డులు పాకిస్తాన్‌ను భారత్‌తో ఆడాలని కోరుతున్నాయి. ఇదే సమయంలో పాక్, భారత్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేస్తే పీసీబీకి తీవ్ర ఆర్థిక నష్టంతో పాటు న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం ఉంది.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇదిలా ఉంటే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఐసీసీ చేయబోయే అత్యవసర సమావేశానికి కొన్ని గంటల ముందు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ లాహోర్ వెళ్లారు. పాకిస్తాన్ పీసీబీ చీఫ్ మోహ్సిన్ నక్వితో భేటీ అయ్యారు. దీంతో, ఈ బాయ్‌కాట్ వివాదానికి ఏదో ఒక ముగింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
Read Also: Shocking Wedding Twist: పెళ్లి మండపంలో ఊహించని ట్విస్ట్.. రూపాయి కట్నం తీసుకొని వివాహం!
భారత్-పాక్ మ్యాచ్ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వచ్చే క్రీడాపోటీ. ఈ మ్యాచ్ రద్దు అయితే ఐసీసీకి బ్రాడ్కాస్ట్ నష్టం, స్పాన్సర్ షిప్, ప్రకటనల విలువ పడిపోతుంది. మొత్తం టోర్నమెంట్ కమర్షియల్‌గా దెబ్బతింటుంది. ఇది జరగకుండా ఉండేందుకు ఐసీసీ సీఈఓ సన్జోగ్ గుప్తా, పాక్ బంగ్లాదేశ్ బోర్డులతో జూమ్ ద్వారా అత్యవసర చర్చలు జరపబోతున్నారు.
అయితే, తమను బహిష్కరించినందుకు భారత్‌తో మ్యాచ్ ఆడకపోవడంపై పాక్‌కు బంగ్లాదేశ్ థాంక్స్ చెబుతోంది. మొత్తం టోర్నమెంట్‌ను రెండు దేశాలు రాజకీయ వివాదంగా మార్చాయి. బంగ్లాదేశ్ లోని యూనస్ తాత్కాలిక ప్రభుత్వం పాక్‌తో సంబంధాలు పెంచుకుంది. భారత్‌లో మ్యాచ్ ఆడకపోవడంలో కూడా ఆ దేశ రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ఇప్పుడుకలిసి ఉంటే భవిష్యత్తులో రాజకీయ, దౌత్య ప్రయోజనాలు ఉండొచ్చని రెండు దేశాలు భావిస్తున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, పాకిస్తాన్‌కు బహిరంగంగా ‘‘థాంక్యూ పాకిస్తాన్’’ అని చెప్పారు.
తాజావార్తలు
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..