హెచ్‌సీఏ అపెక్స్ కౌన్సిల్ తనపై వేటు వేయడాన్ని తప్పుబట్టారు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్.. తనకు ఇచ్చిన నోటీసులు ఇల్లీగల్ అని కొట్టిపారేసిన ఆయన.. అంబుడ్స్ మన్ నియామకం సరైనదేనని హైకోర్టు కూడా చెప్పిందన్నారు.. కానీ, హెచ్‌సీఏలో ఒక వర్గం వ్యతిరేకిస్తోందని.. 25 ఏళ్లుగా అదే వ్యక్తులు… ఎందుకు హెచ్‌సీఏలో ఉన్నారని ప్రశ్నించారు. ఎవ్వరినీ హెచ్‌సీఏలోకి రానివ్వరు.. వచ్చినా ఉండనివ్వరు.. బ్లాక్ మెయిల్ చేస్తారని ఆరోపింపిచారు.. వాళ్ళ అవినీతిని నేను అడ్డొస్తున్నాను అనే… నాపై కుట్రలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు అజార్.. హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగేలా తానెప్పుడూ పనిచేయలేదన్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో 9 మంది ఉంటే.. ఐదుగురు ఒక వర్గంగా ఏర్పడి.. తాము చెప్పిందే వేదంగా భావిస్తే ఎలా అని ప్రశ్నించారు. హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‌లో జరుగుతున్న… జరిగిన అవినీతిని అరికట్టడానికి సమర్థవంతమైన వ్యక్తిని అంబుడ్స్‌మెన్‌గా నియమిస్తే…. ఆ ఐదుగురే తప్పు పట్టారన్నారు. కారణం… వాళ్ళ తప్పుడు పనులు, వాళ్ళ అవినీతి బయట పడుతుందనే అలా చేశారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక, అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌కి కూడా ఆ ఐదుగురు హాజరవ్వడం లేదన్న అజారుద్దీన్… జాన్ మనోజ్, విజయానంద్, నరేష్ శర్మ, సురేందర్ అగర్వాల్, అనురాధ…. ఈ ఐదుగురి పై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. వీళ్ళ అవినీతికి తాను అడ్డుపడుతున్నాననే… వీళ్లకు వీళ్ళు మీటింగ్ పెట్టుకుని నాకు నోటీసులు ఇచ్చారన్నారు. అపెక్స్ కౌన్సిల్ ఇచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారని ఫైర్ అయ్యారు. క్రికెట్.. క్రికెట్ అంటారు… ఒక్కరు కూడా క్రిక్రెట్ అంటే తెలిసిన వాళ్ళు కమిటీలో లేరని ఎద్దేవా చేసిన ఆయన.. నాకు క్రికెట్ అంటే ప్రేమ… క్రికెట్ ని అభివృద్ధి చేయాలన్నదే నా లక్ష్యం అన్నారు. ఉప్పల్ గ్రౌండ్ ఎలా ఉందో చూడండి… నేను అధ్యక్షుడుగా అయినప్పుడు కనీస వసతులు లేవు. షెడ్ ఊడిపోయింది. గ్రౌండ్ నాశనం అయ్యింది.. మరి ఇన్నేళ్లు… హెచ్‌సీఏలో ఉండి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. మరోవైపు.. నేను ఎలాంటి బ్లాక్ మెయిల్స్ కి భయపడను అని స్పష్టం చేశారు అజారుద్దీన్.. ఏజీఎం మీటింగ్ పెట్టుకున్నాం.. దీపక్ వర్మని అంబుడ్స్ మన్‌గా నియమించుకున్నాం.. అందరూ అంగీకారం తెలిపారు. కానీ… పది నిమిషాల్లోనే నేను లేకుండా మరో మీటింగ్ పెట్టుకుని… దీపక్ వర్మ నియామకం చెల్లదు అని డిసైడ్ చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇక, హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో బీసీసీఐకి అన్నీ తెలుసున్న అజారుద్దీన్.. ఈ విషయంపై నేను కూడా బీసీసీఐకి వివరిస్తాను అన్నారు.. ప్రస్తుతం నేనే ప్రెసిడెంట్.. నాకు అన్ని రకాల పవర్స్ ఉన్నాయి.. బోర్డుతో మాట్లాడి.. హెచ్‌సీఏ బాడీని డిసాల్వ్ చేస్తాను అని వ్యాఖ్యానించారు.